చైతూ నిశ్చితార్థం.. ఇండస్ట్రీలో నిశ్శబ్దం

ఇండస్ట్రీ అంతా సైలెంట్ అవ్వడానికి కారణం ఒకటే. ఇన్నేళ్లు గడిచినా ఇంకా నాగచైతన్య-సమంత వ్యవహారం అక్కడక్కడ సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది.

పరిశ్రమలో ఏదైనా ఫంక్షన్ జరిగితే శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. అది సినిమా పండగైనా అయినా, వ్యక్తిగతమైనా అంతా ట్వీట్లతో హోరెత్తిస్తారు. కానీ ఓ హీరో నిశ్చితార్థం చేసుకుంటే మాత్రం ఎవ్వరూ స్పందించలేదు. అంతా ఒకటే నిశ్శబ్దం.

హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత నిశ్చితార్థం పూర్తయింది. దీంతో సెలబ్రిటీల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుందని చాలామంది భావించారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. అలా అని ఇక్కడ హీరో మామూలోడు కాదు. అక్కినేని వారసుడు. అయినప్పటికీ స్పందన నిల్.

కారణం అదే…

ఇండస్ట్రీ అంతా సైలెంట్ అవ్వడానికి కారణం ఒకటే. ఇన్నేళ్లు గడిచినా ఇంకా నాగచైతన్య-సమంత వ్యవహారం అక్కడక్కడ సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది. తాజా నిశ్చితార్థంతో అవి మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి టైమ్ లో నాగచైతన్యకు శుభాకాంక్షలు చెబితే ఒక బాధ, చెప్పకపోతే మరో బాధ.

మనోడే కదా అని విశెష్ చెబితే, సమంత ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ట్రోలింగ్స్ మొదలుపెడతారు. అసలే సోషల్ మీడియా అంతా సెన్సిటివ్ గా మారిపోయిన కాలం ఇది. సంబంధం లేకపోయినా ట్రోలింగ్ కు గురవుతున్న గడ్డు రోజులివి. అందుకే స్టార్స్ అంతా సైలెంట్ అయ్యారు. చిరంజీవి లాంటి అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రం నాగార్జున, నాగచైతన్యకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం చుట్టూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో నడుస్తున్న చర్చ ఇప్పట్లో ఆగేలా లేదు. మరికొన్ని రోజులు అటు సమంతాకైనా, ఇటు నాగచైతన్యకైనా ఈ తలనొప్పులు తప్పవు.

ఇంతకీ వీళ్లిద్దరు ఎక్కడ కలుసుకున్నారు..?

మరోవైపు చైతూ-శోభిత ఎక్కడ కలుసుకున్నారనే చర్చ కూడా నడుస్తోంది. మేజర్ సినిమా టైమ్ లో నాగచైతన్యకు, శోభితకు పరిచయమైందని, అప్పుడే చైతూ కారులో శోభితను తన ఇంటికి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించాడని, ఆ తర్వాత కొన్ని విదేశీ పర్యటనకు కూడా వెళ్లారని కొందరు అంటున్నారు.

మరికొందరు మాత్రం సమంతతో విడిపోవడానికి ముందే నాగచైతన్య-శోభితకు పరిచయమైందని, శోభిత వల్లనే చైతూ-సమంత విడిపోయారని వాదిస్తున్నారు. ఈ చర్చల సంగతి పక్కనపెడితే, ఓ రెస్టారెంట్ లో చెఫ్ తో నాగచైతన్య ఫొటో దిగినప్పుడు వెనక శోభిత కూర్చొని ఉంది. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు ఆ ఫొటో నుంచే మొదలయ్యాయి.

18 Replies to “చైతూ నిశ్చితార్థం.. ఇండస్ట్రీలో నిశ్శబ్దం”

  1. బాబు పాలనా ఇలా

    మండలానికి ఇద్దరిని లేపండి( చంపండీ ) .. టిడిపి ఎమ్మెల్యే

  2. ఇప్పటికి 55 రోజులు , నంద్యాల జిల్లాలో బాలిక (9) సంత్సరాల బాలిక ….శవం కూడా దేరకలే .

    మరి పవన్ ఎక్కడా ????

    పవన్:

    ఎన్నికల ముందు ఏపీలో 30 వేల మంది బాలికలు అదృశ్యం. 

     

    మరి ఇప్పుడు కనీసం శవం నిన్న పట్టుకుందా మన పవన్ అండ్ బాబు బ్యాచ్

  3. నాగ చైతన్య, సమంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి దారి వారిది

    మళ్ళీ పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే సమంత కి ఎందుకు బాధ.ఆమె బాగోదు. ఉంకొకళ్ళను బాగోనివ్వదు.

Comments are closed.