చెడ్డ‌పేరు వ‌స్తుందేమో.. బాబు వ‌ద్ద అనుమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్షాలు విస్తృతంగా ప్ర‌చారం చేశాయి. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేసిన స్థాయిలో కాక‌పోయినా రోడ్లు బాగాలేవ‌న్న‌ది వాస్త‌వం. రోడ్లు వేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్షాలు విస్తృతంగా ప్ర‌చారం చేశాయి. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేసిన స్థాయిలో కాక‌పోయినా రోడ్లు బాగాలేవ‌న్న‌ది వాస్త‌వం. రోడ్లు వేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బు లేక‌పోయింది. ఉన్న‌దంతా సంక్షేమ ప‌థ‌కాల‌కే స‌రిపోయేది.

ఈ నేప‌థ్యంలో రోడ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యించింది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం వ‌ద్ద కూడా డ‌బ్బులేదు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఓ ఆలోచ‌న చేశారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో (పీపీపీ) ర‌హ‌దారులు వేయాల‌ని నిర్ణ‌యించారు. అప్పుడే ఈ విధానంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ పొలిట్‌బ్యూరో స‌మావేశంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు త‌న భ‌యాన్ని చంద్ర‌బాబు వ‌ద్ద బ‌య‌ట పెట్టారు. “పీపీపీ ప‌ద్ధ‌తిలో రోడ్లు వేస్తే ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుందేమో సార్” అని బాబుతో ప‌ల్లా అన్నారు. బాబులో కూడా అలాంటి భ‌య‌మే ఉన్న‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి ఆయ‌న మాట‌ల్లో క‌నిపించింది.

రోడ్లైతే వేయాలి క‌దా అని స‌మావేశంలో బాబు అన్నారు. బ‌స్సులు, కార్లు, భారీ వాహ‌నాల‌కు మాత్ర‌మే టోల్ చార్జీలు వ‌సూలు చేస్తారని బాబు చెప్పుకొచ్చారు. ద్విచ‌క్ర వాహ‌నాలు, ఆటోలు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు చేసే ట్రాక్ట‌ర్లకు ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌ర‌ని స‌మావేశంలో బాబు తెలిపారు. పీపీపీ రోడ్ల‌పై స‌మాజాభిప్రాయాల‌పై పొలిట్‌బ్యూరో స‌మావేశంలో చ‌ర్చ‌కు రావ‌డం మంచి ప‌రిణామం. బాబు చెప్పిన‌ట్టు ద్విచ‌క్ర వాహ‌నాలు, ట్రాక్ట‌ర్ల‌కు ఉచిత‌మ‌ని చెప్ప‌డం కొంత వ‌ర‌కు ఊర‌ట క‌లిగించే అంశం.

14 Replies to “చెడ్డ‌పేరు వ‌స్తుందేమో.. బాబు వ‌ద్ద అనుమానం!”

  1. Jeggulu 10 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం రోడ్లు కూడా వేయకుండా, కేవలం 2.7 లక్షల కోట్లు మాత్రమే పంచావు .. మిగతాది ఎక్కడ రా.. యిర్రి నా Leven ల0గా??

  2. వేయాల్సిన పన్నే అడ్డదిడ్డంగా తిరిగే 2/3 వీల్లర్ల్ఆ మీద వాళ్ళ వలనే రోడ్లు పాడయ్యేది….దేవాలయాల్లో హుండీలలో సొమ్ము దిగువ తరగతుల వాళ్ళ వలనే రాబడి చూస్తాయన్నది నిజమే కదా..వాళ్లలో అధిక శాతం పన్నులు ఎగ్గొట్టే వాళ్లే…

  3. ల0గా Leven గాడు 10 లక్షల కోట్లు అప్పు చేసి.. తాడేపల్లి ప్యాలస్ చుట్టూ రోడ్లు మూసేసి hitech రోడ్లు వేయించుకుని, 100 అడుగులు iron కోట కట్టుకుని, Tirumala గుడి సెట్టింగ్ వేసుకుని జల్సా చేశాడు.

  4. జగనన్న ప్రభుత్వంలో వాహనదారుల పట్ల జరిగిన ఒకే మంచి పని విద్యుత్తు వాహనాల మీద రోడ్డు పన్ను లేకుండా చేయడం (చివరి 6 నెలల కాలంలో). దానిని పొడిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా వసూళ్లు చేస్తూ మరలా పర్యావరణానికి ఏదో మేలు చేస్తున్నామని కారుకూతల ప్రసంగాలు చేయడం. తెలంగాణలో 5 లxక్షల విద్యుత్తు వాహనాల మీద రాయితీలు ఇస్తూ, కొత్త విద్యుత్తు బస్సులు కొనుగోళ్లు చేసుకుంటూ పోతుంటే ఇక్కడ 20 లxక్షల kilometers దాటిన వాటిని కూడా అడ్డగోలుగా తిప్పేస్తున్నారు.

Comments are closed.