కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుంది తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. పెళ్లి ఫొటోల్ని కూడా షేర్ చేసింది. గోవాలోని ఓ లగ్జరీ హోటల్ లో సాక్షి అగర్వాల్, నవనీత్ వివాహం గ్రాండ్ గా జరిగింది.
“నా చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడ్డంతో నా కల నిజమైంది. నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఇతడే. కలిసి పెరిగిన మేమిద్దం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది.” అంటూ ప్రకటించింది సాక్షి.
తమిళ సినిమాలతో ఎక్కువగా పాపులరైంది సాక్షి. అయితే ఆమెకు స్టార్ డమ్ రాలేదు. పెద్ద హీరోలు ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఆమె బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరైంది. హౌజ్ లో ఆమెకు మంచి పేరొచ్చింది.
బిగ్ బాస్ ఫేమ్ తో మరిన్ని సినిమా అవకాశాలు పొందింది. ఓవైపు 2 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంటుండగానే, మరోవైపు నవనీత్ ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సాక్షి అగర్వాల్. సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ తో కూడా ఆమె చాలా పాపులర్.
Childhood friend