మెకానిక్ రాఖీ తరువాత విష్వక్ సేన్ నుంచి మరో సినిమా వస్తోంది లైలా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తరువాత మెకానిక్ రాఖీ కాస్త పెద్దగా గ్యాప్ లేకుండా వచ్చింది. దాని తరువాత కూడా పెద్దగా గ్యాప్ లేకుండానే లైలా సినిమా ఫిబ్రవరిలో వస్తోంది. నిజానికి మెకానిక్ రాఖీ మాదిరి సినిమా కాదు లైలా. కానీ ఈ సినిమాను ప్రెజెంట్ చేసే విధానం చూస్తే మళ్లీ ఓ రొటీన్ సినిమా విష్వక్ సేన్ నుంచి వస్తోంది అనేలా ఉంది.
పండగ సినిమాల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేయడమే ఓ తప్పు. ఈ గోలలో, ఈ గాలిలో కలిసిపోతుంది. అలాంటిది ఓ రొటీన్ పాట వదిలారు. దాంతో అది గుర్తించలేనిదిగా మారింది. అందువల్ల లైలా పబ్లిసిటీ విషయంలో, సినిమాను జనాల ముందుకు తీసుకెళ్లే విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది.
లైలా సినిమా సెకండాఫ్‌లో ఎక్కువగా లేడీ గెటప్‌లో కనిపిస్తాడు హీరో. అంతా హిల్లేరియస్ కామెడీ ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టకుండా, అమ్మాయిలు, బృందగానం, డ్యాన్స్ అంటూ రొటీన్ వైపు వెళ్లారు. విష్వక్ తన సినిమా ప్రచారాన్ని కంటెంట్ దిశగా మళ్లించాలి. సినిమాలో ఏది ఉందో అదే చెప్పాలి. జనాలకు ఏది ఉందో అన్నది స్పష్టత ఇవ్వాలి. వైరల్ ప్రచారం కన్నా నిజాయితీ ప్రచారం ద్వారా సినిమాను జనం ముందు పెడితే నమ్ముతారు.
అలా కాకుండా తను వైరల్ కావాలి, సినిమా వైరల్ కావాలి అనుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. టీమ్ అయినా, విష్వక్ అయినా ఈ విషయంపై దృష్టి పెట్టాలి.