నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదు

మనం సినిమాలు ఎంచుకోలేం. ఆ కథలే మనల్ని వెదుక్కొని వస్తాయి. డాకు మహారాజ్ కోసం బాబి నన్ను సెలక్ట్ చేశాడు.

వరుసగా బాలకృష్ణతో సినిమాలు చేస్తోంది ప్రగ్యా జైశ్వాల్. త్వరలోనే బాలయ్య సరసన డాకు మహారాజ్ సినిమాలో కనిపించనుంది. ఆ వెంటనే అఖండ-2 కోసం బాలకృష్ణతో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఇదంతా యాధృచ్ఛితంగా జరిగిందని చెబుతోంది ప్రగ్యా. డాకు మహారాజ్ లో హీరోయిన్ పాత్ర కోసం తనను బాలయ్య సిఫార్స్ చేయలేదని, దర్శకుడు బాబి తనను ఎంపిక చేశాడని అంటోంది.

“మనం సినిమాలు ఎంచుకోలేం. ఆ కథలే మనల్ని వెదుక్కొని వస్తాయి. డాకు మహారాజ్ కోసం బాబి నన్ను సెలక్ట్ చేశాడు. చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. డాకు మహారాజ్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు, నా పాత్రను నేను తెరపై చూసుకునేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నా”

డాకు మహారాజ్ రిలీజ్ రోజునే తన పుట్టినరోజును జరుపుకోబోతోంది ప్రగ్యా జైశ్వాల్. ఈ ఏడాది డాకు మహారాజ్ రిలీజ్ తన బర్త్ డే గిఫ్ట్ అంటోంది. ఇక తనపై వచ్చిన గాసిప్స్ పై స్పందిస్తూ, ఇప్పటివరకు బాధపడే పుకార్లేవీ తనకు వినిపించలేదని, తనపై అన్నీ మంచి రూమర్సే వచ్చాయంటోంది ప్రగ్యా.

3 Replies to “నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదు”

Comments are closed.