జేసీ ఏం మాట్లాడ్తాడో ఆయ‌న‌కే తెలియ‌దన్న మంత్రి

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎప్పుడేమి మాట్లాడ్తారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని దెప్పి పొడిచారు. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు మాట్లాడితే జేసీకే మంచిద‌ని వార్నింగ్ ఇచ్చారు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు బీజేపీ నేత‌ల‌కు కోపం తెప్పించాయి. జాతీయ పార్టీకి బాగా సెగ త‌గిలిన‌ట్టుంది. అందుకే ఒక్కొక్క‌రుగా జేసీపై మండిప‌డుతున్నారు. త‌న బ‌స్సును బీజేపీ నేత‌లే త‌గుల‌బెట్టార‌నే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అలాగే బీజేపీ నేత‌ల కంటే హిజ్రాల న‌యం అని అన్నారు. కొంద‌రు బీజేపీ మ‌హిళా నేత‌ల్ని తీవ్ర అభ్యంత‌ర‌క‌ర భాష‌లో తిట్టారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ స్పందించారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎప్పుడేమి మాట్లాడ్తారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని దెప్పి పొడిచారు. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు మాట్లాడితే జేసీకే మంచిద‌ని వార్నింగ్ ఇచ్చారు. అలాగే జేసీ వ్యాపారాల‌పై అనేక ఆరోప‌ణ‌లున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇదిలా వుండ‌గా త‌మ పార్టీ మ‌హిళా నేత‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేసిన జేసీపై ఏపీ బీజేపీ చీఫ్‌, మ‌హిళా నాయ‌కురాలైన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి స్పందించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. వైసీపీ నేత‌ల‌కు మాత్ర‌మే నీతులు చెప్ప‌డానికేనా పురందేశ్వ‌రి ఉండేద‌ని సొంత పార్టీ నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌తంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, జేసీ మ‌ధ్య బూడిద విష‌య‌మై గొడ‌వ చెల‌రేగితే, అది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని పురందేశ్వ‌రి అన్నారు. ఇప్పుడు బీజేపీపై దారుణ కామెంట్స్ చేసినా పురందేశ్వ‌రి మాత్రం త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

5 Replies to “జేసీ ఏం మాట్లాడ్తాడో ఆయ‌న‌కే తెలియ‌దన్న మంత్రి”

  1. అన్న మళ్ళి లండన్ వెల్లాలి అంట! బెయిల్ షరతులను సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ విషయం రాయవా ఎమిటి GA?

  2. ఏమి మాట్లాడిన బీజేపీ పీకేది ఏమి లేదు అనే ధైర్యం.

    ఈ కామెంట్స్ నార్త్ ఇండియా లో చేసి ఉంటే వాణ్ణి తగలబెట్టేవాళ్ళు.

Comments are closed.