గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారంలో కియరా లాంటి స్టార్ కనిపించడం తప్పనిసరి.

గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి అమెరికాలోని డాలస్ లో భారీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ కార్యక్రమానికి హీరోయిన్ కియరా అద్వానీ వెళ్లలేదు. తాజాగా హైదరాబాద్ లో ట్రయిలర్ లాంఛ్ చేశారు. కీలకమైన ఈ కార్యక్రమానికి కూడా కియరా రాలేదు.

దీంతో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో ఆమె కనిపిస్తుందా లేదా అనే అనుమానం అందరికీ వచ్చింది. రేపు మరో భారీ ఈవెంట్ చేస్తున్నారు. బహుశా, సినిమాకు సంబంధించి ఇదే చివరి భారీ పబ్లిక్ ఫంక్షన్ కావొచ్చు. మరి దీనికైనా కియరా హాజరవుతుందా?

పెద్ద సినిమాల ప్రచారానికి హీరో ఎంత అవసరమో, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారంలో కియరా లాంటి స్టార్ కనిపించడం తప్పనిసరి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు.

ఈరోజు తన సినిమా ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లాడు చరణ్. కొన్ని రియాలటీ షోల్లో ఆయన జాయిన్ అవుతాడు. ఎంపిక చేసిన ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నాడు. వీటిలో కొన్నింటికి ఆమె హాజరయ్యే అవకాశం ఉంది. ఇక రేపు భారీ ఈవెంట్ కు ఆమె వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్, కియరా అద్వానీ కలిసి చేసిన రెండో సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో సైతం రిలీజ్ చేస్తున్నారు.

3 Replies to “గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?”

Comments are closed.