కేబినెట్‌లోకి నాగ‌బాబు.. మంత్రివ‌ర్గంలో మార్పులుండ‌వ్‌!

అన‌వ‌స‌రం అనుమానాల‌కు చోటు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఆ ర‌కంగా మాట్లాడి వుంటారా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి కేబినెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ద‌ఫా చంద్ర‌బాబు వినూత్నంగా త‌క్కువ మంది సీనియ‌ర్ల‌ను, ఎక్కువ మంది కొత్త‌వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. లోకేశ్ టీమ్‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో కొంత మంది అనుభ‌వ‌లేమితో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకొస్తున్నార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ను ఫెయిల్యూర్ మినిస్ట‌ర్‌గా కూట‌మి నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. ఆ మ‌ధ్య డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగానే అనిత‌కు చుర‌క‌లు అంటించారు. అబ్బే, త‌న‌ను ఏమీ అన‌లేద‌ని అనిత మీడియాతో ఎన్నైనా చెప్పి వుండొచ్చు కానీ, ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ‌మాదిగ త‌మ కులానికి చెందిన మ‌హిళా మంత్రిపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్‌పై ఏ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారో అంద‌రికీ తెలుసు.

అందుకే కొంత మంది మంత్రుల్ని త‌ప్పించి, కొత్త‌వారికి చోటు క‌ల్పిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ప్ర‌స్తుతానికి ఒకే ఒక్క‌రికి కేబినెట్‌లో చోటు క‌ల్పించే అవ‌కాశం వుంది. ఆ ఒక్క మంత్రిత్వ బెర్త్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబుతో భ‌ర్తీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని మ‌రోసారి మంత్రి కొల్లు ర‌వీంద్ర స్ప‌ష్టం చేశారు. కేబినెట్‌లో మార్పుల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. త‌న‌కు తెలిసి, బాబు కేబినెట్‌లో మార్పులుండ‌వ‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డం విశేషం.

అన‌వ‌స‌రం అనుమానాల‌కు చోటు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఆ ర‌కంగా మాట్లాడి వుంటారా? లేక నిజంగానే మార్పులుండ‌వా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. కొల్లు ర‌వీంద్ర చెప్పిన‌ట్టు ఒక‌వేళ కేబినెట్‌లో మార్పులు లేక‌పోతే, మ‌రి నెగెటివిటీని ఏ ర‌కంగా ఎదుర్కొంటార‌నేది కూడా ప్ర‌శ్నే. ఇలాంటి అన్ని ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

13 Replies to “కేబినెట్‌లోకి నాగ‌బాబు.. మంత్రివ‌ర్గంలో మార్పులుండ‌వ్‌!”

  1. అన్న మళ్ళి లండన్ వెల్లాలి అంట! బెయిల్ షరతులను సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం రాయవా ఎమిటి GA?

    1. ఈ సారి అన్న లండన్ లొ కారు లొ వెల్తుంటె, కారు పక్కనె మొక్కాళ్ళ మీద నుంచొని అన్నకి దన్నం ఎంత మంది పెడతారొ చూద్దం!

      1. Enti Africa nundi kuda dry east kavala??

        anduke vallani kuda vadaltleda raa tdp pigs miru, pushkaralu lo Oka vanda mandi ni vesadu…guntur incident tarvata vijayawada lo vesadu…

Comments are closed.