హిట్ సీక్వెల్ లో అడవి శేష్

నాని నిర్మాతగా వచ్చిన హిట్ సినిమాకు అన్ని వైపుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. కమర్షియల్ గా కూడా ఓకె అనిపించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. Advertisement ఇప్పటికి…

నాని నిర్మాతగా వచ్చిన హిట్ సినిమాకు అన్ని వైపుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. కమర్షియల్ గా కూడా ఓకె అనిపించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఇప్పటికి సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. హిట్ సీక్వెల్ స్పెషల్ ఏమిటంటే, దీంట్లో అడవి శేష్ హీరోగా నటించడం. 

హిట్ వన్ లో విష్వక్ సేన్ నటించాడు. సీక్వెల్ లో మాత్రం అడవిశేష్ నటిస్తున్నాడు. మిగిలినదంతా దాదాపు సేమ్. శైలేష్ కొలను నే దర్శకుడుగా వుంటారు. నాని నిర్మాత.

ప్రస్తుతం అడవిశేష్ మేజర్ సినిమాను చేస్తున్నాడు. దాని తరువాత చేయబోయే సినిమా హిట్ సీక్వెల్ నే. ఈ సినిమాను మార్చి నుంచి ప్రారంభించి మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తారు.

పవన్ కు కానరాని మద్దతు