Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెక్సీ బాడీ లేదని బాధపడొద్దు: ఇలియానా

సెక్సీ బాడీ లేదని బాధపడొద్దు: ఇలియానా

చాలామంది అమ్మాయిలు తమకు మంచి శరీర సౌష్టవం లేదని బాధపడుతుంటారు. అద్దంలో చూసుకున్నప్పుడు తాము అందంగా కనిపించడం లేదని, అబ్బాయిల్ని ఎట్రాక్ట్ చేయలేకపోతున్నామని తెగ ఇదైపోతుంటారు. దీన్నే బాడీ డిస్-మార్ఫిక్ డిజార్డర్ అని కూడా అంటారు. కేవలం సగటు అమ్మాయిలే కాదు, హీరోయిన్లలో కూడా ఇలా బాధపడిన వాళ్లున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలియానా. 

తన అందచందాలతో, నడుము ఒంపులతో కుర్రాళ్లను పిచ్చెక్కించింది ఇలియానా. అలాంటి గోవా బ్యూటీ కూడా ఓ దశలో అందంగా లేనని బాధపడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇలియానా బయటపెట్టింది. ఐదేళ్ల కిందట తను ఈ సమస్యతో బాధపడినట్టు బయటపెట్టింది.

"మనం ఎంత అందంగా ఉన్నప్పటికీ అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో లోపం కనిపిస్తుంది. అది నిజమే అని ఇతరులు చెప్పాలని కోరుకుంటాం. దాన్ని కవర్ చేసుకునేందుకు చాలా ప్రయత్నిస్తాం, ఎన్నో వ్యాయామాలు చేస్తాం. కానీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించినప్పుడు, మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందంగా కనిపిస్తామనే విషయాన్ని అంతా మరిచిపోతున్నాం."

ఇలా తను అనుభవించిన సమస్యతో పాటు దానికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది ఇలియానా. ఒకప్పుడు తను తన శరీరాన్ని చూసి బాధపడ్డానని, కానీ ఇప్పుడు తన బాడీలో పాజిటివ్ అంశాల్ని చూస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ 34 ఏళ్ల గోవా బ్యూటీ. తనలా ప్రతి అమ్మాయి ఆలోచిస్తే, అందానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవని, బాడీ షేమింగ్ అనే సమస్యే తలెత్తదని చెబుతోంది.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?