ఈ కౌంటర్ కు సమాధానం ఉందా..?

జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కోర్టు వెలుపల ఇంటర్వ్యూల రూపంలో వాదనలు-ప్రతివాదనలు జరుగుతున్నాయి.

లైంగిక వేధింపుల ఆరోపణలపై పోక్సో చట్టం కింద అరెస్టై, కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపిన జానీ మాస్టర్ బెయిల్ పై బయటకొచ్చాడు. అతడు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వివాదం పెద్దగా రాజుకోలేదు.

ఎప్పుడైతే అతడు తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడో, అప్పుడు ఈ వివాదం మళ్లీ ముసురుకుంది. అతడు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే, సదరు బాధితురాలు శ్రేష్టి వర్మ కూడా మీడియా ముందుకొచ్చింది. ఆమె కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది.

జానీ మాస్టర్ తన ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణలన్నింటికీ ఆమె సమాధానమిచ్చింది. గట్టిగా కౌంటర్లు కూడా వేసింది. ఎలాంటి మాస్క్, ముసుగు లేకుండా ఓపెన్ గా మీడియా ముందుకొచ్చిన శ్రేష్టి, జానీ మాస్టర్ తనను ఇండస్ట్రీకి తీసుకురాలేదని, తన స్వశక్తితో పైకొచ్చానని ప్రకటించుకుంది. అక్కడితో ఆగకుండా జానీ మాస్టర్ కు గుణం లేదని కూడా తేల్చేసింది.

ఇప్పుడు శ్రేష్టి ఇంటర్వ్యూకు కౌంటర్ రెడీ అయింది. జానీ మాస్టర్ భార్య జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా తెరపైకొచ్చారు. తన భర్త జానీ మాస్టర్ పై శ్రేష్టి మనసు పడిందని, అందుకే ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మరో ఆరోపణ కూడా చేశారు.

“ఆరేళ్లు నా భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెబుతోంది. రెండేళ్లుగా జానీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెను మేం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించి, దూరం పెట్టాం. అలాంటిది ఇప్పుడామె జానీపై ఫిర్యాదు చేయడం ఏంటి? ఆమె ఉద్దేశం ఏంటో ఇక్కడే తెలిసిపోతోంది కదా.”

కేవలం తన భర్తను ఇబ్బంది పెట్టడం కోసమే శ్రేష్టి ఇలా వ్యవహరిస్తోందని, లైంగిక వేధింపులు చేశాడనేది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఆయేషా. శ్రేష్టికి అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించి, ఆమె చెల్లెలి చదువు కోసం కూడా సహాయం చేసిన జానీ మాస్టర్ పై కేసు పెట్టాలని ఆమెకు ఎలా అనిపించిందని ప్రశ్నిస్తోంది.

ఇలా జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కోర్టు వెలుపల ఇంటర్వ్యూల రూపంలో వాదనలు-ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈసారి శ్రేష్టి ఎలాంటి వాదనలతో తెరపైకొస్తారో చూడాలి.

5 Replies to “ఈ కౌంటర్ కు సమాధానం ఉందా..?”

  1. After separation all is well. Once national award announced for Jani, it did not go well for our iconic little star. And this star had some crush on the girl. He gave backing to the girl and encouraged to file love jihad accusations. and so on now little star spent overnight in jail and the lovely little boy still in hospital, a sword hanging on the neck for the little star. So the star seems backed out. Now the Girl wants to save her career and now with the help of film chamber ladies and other so called sangh ladies. The chances are dim for the girl.

  2. After separation all is well. Once national award announced for Jani, it did not go well for our iconic little star. And this star had some crush on the girl. He gave backing to the girl and encouraged to file love accusations. and so on now little star spent overnight in jail and the lovely little boy still in hospital, a sword hanging on the neck for the little star. So the star seems backed out. Now the Girl wants to save her career and now with the help of film chamber ladies and other so called sangh ladies. The chances are dim for the girl.

  3. After separation all is well. Once national award announced for Jani, it did not go well for our iconic little star. And this star had some crush on the girl. He gave backing to the girl and encouraged to file love accusations. and so on now little star spent overnight in jail and the lovely little boy still in hospital, a sword hanging on the neck for the little star. So the star seems backed out. Now the Girl wants to save her career and now with the help of film chamber ladies and other so called political ladies. The chances are dim for the girl.

  4. శ్రేష్టికి అల్లు అర్జున్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది అది బహిరంగ రహస్యం , ఇప్పటికైనా శ్రేష్టి కుట్రలు మానుకోవాలి

Comments are closed.