హిట్ కొట్టిన హీరోయిన్ ను ఎవ్వరూ వదులుకోరు. వెంటనే అవకాశాలిస్తుంటారు. చేతిలో సినిమా లేకపోయినా, అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు కోకొల్లలు. ఎందుకంటే, సక్సెస్ ఫుల్ ముద్దుగుమ్మల్ని ఇండస్ట్రీ సెంటిమెంట్ గా ఫీలవుతుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హిట్ కొట్టారు. వీళ్లలో మీనాక్షికి అవకాశాలకు కొదవలేదు. కాల్షీట్లు లేక ఆమె కొన్ని సినిమాలు వదులుకుంటోంది కూడా. మరి ఐశ్వర్య రాజేశ్ సంగతేంటి?
మీనాక్షి కంటే సీనియర్ ఐశ్వర్య. అయితే తెలుగులో ఆశించిన బ్రేక్ రాలేదు. ఇన్నాళ్లకు వెంకటేశ్-అనీల్ రావిపూడి చలవతో క్రేజ్ తెచ్చుకుంది, హిట్ కొట్టింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలొస్తున్నట్టు కనిపించడం లేదు.
ఐశ్వర్య రాజేష్ ను గ్లామర్ హీరోయిన్ గా చూడ్డం లేదు టాలీవుడ్. అది నిజం కూడా. మంచి కంటెంట్ పడితే ఎలాంటి పాత్రనైనా పోషించే సత్తా ఆమె సొంతం. అంతే తప్ప, చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, మాస్ స్టెప్పులు వేస్తూ, హీరోలకు ముద్దులిచ్చే టైపు పాత్రలు ఆమె పెద్దగా చేయదు. సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చిపడింది.
టాలీవుడ్ లో ఎక్కువ హీరోయిన్ రోల్స్ పైన చెప్పుకున్న బాపతే. ఎప్పుడో, ఎక్కడో ఓ మంచి పాత్ర పడుతుంది. అది ఐశ్వర్యకు రావాలి. అంతవరకు ఆమె వెయిట్ చేయాలి. ఈలోగా టాలీవుడ్ పెద్ద (వయసు) హీరోలకు ఆమె మంచి ఆప్షన్ గా మారింది. ఉన్నంతలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఐశ్వర్యకు చేసిన సహాయం ఏదైనా ఉందంటే ఇదే.
హు
హాయ్ ప్లే బాయ్ వర్క్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు eidhu ఐదు
హు బ్లాయ్ వర్క్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు ఐదు ఐదు
Black beauty
హు ప్లే బాయ్ వర్క్ వుంది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి సున్నా సున్నా, నాలుగు