లవ్, రొమాంటిక్ రిలేషన్ షిప్ విషయంలో ప్రాక్టికల్ గా ఉన్నారనుకోవాలో, లేదా సీరియస్ గా లేరు అనుకోవాలో కానీ.. నయా జనరేషన్ రూటు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రొమాంటిక్ రిలేషన్ షిప్ విషయంలో గత జనరేషన్లన్నీ ఆశ్చర్యపోయే రీతిలో ప్రస్తుత జనరేషన్ వ్యవహారాలు ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ప్రేమ విషయంలో రకరకాల పదాలు వినిపిస్తూ ఉన్నాయి. లవ్, అట్రాక్షన్, బ్రేకప్ వంటి పదాలే గతంలో వినిపించేవి ఈ విషయాల్లో. అయితే ఇప్పుడు లెక్కలేనన్ని రకాల రిలేషన్ షిప్స్, వాటికి లెక్కలేనన్ని పదాలు! వాటి నిర్వచనాలు అంత తేలికగా అర్థం అయ్యేవి కూడా కావు. మరి ఈ జార్గాన్ కు అర్థపర్థాలు ఏమిటో ఆరా తీస్తే చాలా వివరాలే తెలుస్తాయి!
లవ్ బాంబింగ్ : కొత్తగా పరిచయం అయిన వ్యక్తిపై లవ్ ఇంట్రస్ట్ తో విపరీతమైన అటెన్షన్ ఇవ్వడం, గిఫ్ట్ లు ఎడాపెడా ఇస్తూ ఉండటం. ఇదంతా హనీమూన్ పిరియడ్ లాంటిది. ఈ పీరియడ్ దాటిన తర్వాత లవ్ బాంబర్లు ఆసక్తిని పూర్తిగా కోల్పోతారు. మునుపటి ఉత్సాహాన్ని ఏ రకంగానూ చూపరు.
అఫర్డేటింగ్: ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్. వీలైతే అతి తక్కువ ధరతో కూడుకున్న యాక్టివిటీస్ ను పెట్టుకోవడం లేదా, ఎక్స్ పెన్సెస్ ను సగంసగం షేర్ చేసుకోవడం.
డెల్యూషన్ షిప్: ఊహల్లో తేలిపోవడంలాంటిది. ఎవరో తెలిసిన వారిని ఊహించుకుని వారితో ఉంటున్నట్టుగా ఊహించుకోవడం.
నానో షిప్: స్వల్పకాలిక, క్యాజువల్ కనెక్షన్. దీర్ఘకాలికంగా కొనసాగుతుందని అనుకోవడం కానీ, కమిట్ మెంట్ కానీ ఏమీ ఉండదు.
లవ్ హేజ్: రిలేషన్ షిప్ లో తొలి దశలో ఉండటం, ఈ దశలో కొన్ని రెడ్ ఫ్లాగ్ లు ఎదురయినా వాటిపై పట్టింపు ఉండదు. సిట్చుయేషన్ షిప్ ఇందులో హద్దులంటూ ప్రత్యేకంగా ఉండవు. పేరును బట్టి చూస్తే అవసరాన్ని బట్టి ఏర్పడే బంధం. స్నేహం కావొచ్చు, సహోద్యోగం కావొచ్చు.. ఎలాగో జరిగిన పరిచయాలు హద్దు ఏమీ లేకుండా ముందుకు చొచ్చుకురావొచ్చు. దీంట్లో ఫ్రెండ్షిప్, కమిట్ మెంట్, బౌండరీస్ అనే వాటి మధ్యన పెద్దగా అంతరాలు ఉండవు. పరస్పర అవసరం ఉన్నంత వరకూ సాగే బంధం. ఈ విషయం ఇద్దరికీ క్లారిటీ ఉంటుంది. ఉండాలి.
కుకీ జారింగ్:సేఫ్టీ నెట్ గా మిమ్మల్ని ఆప్షన్ లో పెట్టుకోవడం. ఎలాంటి రియల్ లవ్ ఉండదు, వారి ప్రస్తుత లవ్ స్టోరీలో ఏదైనా తేడా వస్తే మీరొక బ్యాకప్ ప్లాన్.
గోస్టింగ్: ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వివరణలు ఇవ్వకుండా రిలేషన్ షిప్ ను ఏకపక్షంగా రద్దు చేసుకోవడం. అర్ధాంతరంగా దూరం అయిపోవడం. ప్రత్యేకించి ఆన్ లైన్ డేటింగ్, టెక్ట్సింగ్ లో ఇది జరుగుతూ ఉంటుంది.
జాంబీయింగ్: గతంతో మీతో గోస్టింగ్ చేసి, ఆ తర్వాత ఉన్నట్టుండి మళ్లీ కనిపిస్తూ రీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం.
బ్రెడ్ క్రంబింగ్: కమిట్ మెంట్ లేకుండా, అవతలి వారిని ఫ్లర్ట్ చేస్తూ మెసేజ్ లు పంపడం, సిగ్నల్స్ ఇవ్వడం.. ఆసక్తి ఉందని చెప్పడం. ఎలాంటి సీరియస్ కమిట్ మెంట్ లేకుండా ఫ్లర్టింగ్ మాత్రమే పని.
బెంచింగ్: రొమాంటిక్ ఇంట్రస్ట్ ను ఎక్స్ ప్రెస్ చేసిన వారిని లేదా లవ్ ప్రపోజ్ చేసిన వారిని ఒక అప్షన్ గా పక్కన పెట్టి ఉంచుకోవడం. ఎక్కువ ప్రపోజల్స్ వస్తున్నప్పుడు కొందరికి స్ట్రిక్ట్ గా నో చెప్పకుండా, వారితో ఆచితూచి మాట్లాడుతూ ఉంచడం. వేరొకరితో కమిటెడ్ రిలేషన్ షిప్ గడుపుతున్నా, ఇంకోరిని ఇలా ఆప్షన్ లో పెట్టే పద్ధతీ ఉంటుంది కొందరికి.
ఫ్లర్ట్రేషన్ షిప్: ఎలాంటి ఎమోషనల్ అటాచ్ మెంట్ లేకుండా క్యాజువల్ గా ఫ్లర్ట్ చేయడం.
టెక్ట్స్లేషన్ షిప్: కేవలం మెసేజ్ లు, చాటింగ్ ద్వారా సాగే రొమాంటిక్ రిలేషన్ షిప్
కుషనింగ్: ఇది కూడా బెంచింగ్ లాంటిది, ఏదైనా కమిటెడ్ రిలేషన్ షిప్ ఎండ్ అయినా, పెద్ద బాధ లేకుండా బ్యాకప్ ను కలిగి ఉండటం.
రిజప్: ఒకరిలో ఏదో రకంగా ఆకర్షణను రేకెత్తించి, ఆ తర్వాత వారిని క్యాజువల్ రొమాంటిక్ వేలోకి తీసుకురావడం. ఆకర్షణతో స్నేహం ఏర్పడ్డాకా ఒకరకంగా ప్రవర్తించి రొమాంటిక్ రిలేషన్ కోసం ప్రయత్నించడం.
Enti ee karma maku.
Eraa enki ga… Iyanni googling chesthe vasthai gadhara.. mali maaku ikkada endhuku ra… Janaalni ibbandhi pettadam kakapothe
మన దేశానికి సంబంధించినవి ఏవైనా రాయండి సర్.. ఎక్కడో ఇతర దేశాల్లో కనిపించిన వినిపించిన పదాలన్నీ వాడేసి.. ఎందుకు సర్ .. ఏమి ఉపయోగం..
ఇవన్నీ సరే గానీ.. ఈ కాలం అన్నిటికన్నా గొప్పగా నడుస్తున్నది మాత్రం ఓపెన్ మేరేజ్…