ఈస్ట్.. కృష్ణా… నైజాం

రాను రాను టాలీవుడ్ లో థియేటర్లు షేరింగ్ మీద ఆడాలనే డిమాండ్ పెరుగుతోంది.

రాను రాను టాలీవుడ్ లో థియేటర్లు షేరింగ్ మీద ఆడాలనే డిమాండ్ పెరుగుతోంది. ముందుగా ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు ఈ నినాదం స్టార్ట్ చేసారు. తీర్మానం చేసారు. ఇలాంటి టైమ్ లో కృష్ణా జిల్లా ఎగ్జిబిటర్లు అంతా ఏకతాటి మీదకు వచ్చి ఇదే తీర్మానం మీద సంతకాలు చేసారు. నైజాంలో బిగ్ ఎగ్జిబిటర్లు సునీల్-సురేష్-శిరీష్ చేతులు కలిపి ఇదే దిశగా ముందుకు సాగుతున్నారు.

దీంతో ఏం చేయాలో, దీన్ని ఎలా నివారించాలో తెలియక నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. నిజంగా ఎగ్జిబిటర్లు స్టబర్న్ గా వుంటే నిర్మాతలు చేయగలిగింది ఏదీ లేదు. సినిమా తీసి ఎక్కడ విడుదల చేసుకోవాలి? అలా అని టికెట్ ఆదాయం సగం వాళ్లకే ఇచ్చేస్తే ఇక నిర్మాతకు మిగిలేది ఏమి వుంటుంది అన్నది క్వశ్చను.

ఇలాంటి నేపథ్యంలో ఎగ్జిబిటర్లను ఎలా దారికి తేవాలి? ఇదే ఇప్పుడు నిర్మాతల మందు వున్న పెద్ద టాస్క్. లాభం లేని వ్యాపారం ఎవరూ చేయలేరు. అలా అని సినిమా నిర్మాణాలు ఆపేసి వేరే పనుల మీదకు వెళ్లలేరు. ఇక మిగిలిన మార్గం ఒకటే ఓటిటి ఆదాయం పెంచుకోవడం. రెండు, మూడు వారాలకు ఓటిటికి ఇచ్చేసి అదనపు ఆదాయం పొందడం ..లేదా ప్రతి చిన్న పెద్ద సినిమాకు టికెట్ రేట్లు తెచ్చుకోవడం. కానీ దేని మైనస్ లు దానికి వుంటాయి. ప్లస్ లు వుంటాయి. మైనస్ లు వుంటాయి.

అందుకే ఈ చిక్కుముడిని స్మూత్ గా విప్పాలి. ఈ టోటల్ వ్యవహారం వెనుక వున్న పెద్ద తలకాయలు ఎవరో ఆలోచించి, అట్నుంచి నరుక్కు రావాల్సి వుంటుంది. ఇప్పుడు ఆ డిస్కషన్లే నడుస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ విడుదల లేదు. కనీసం మూడు వారాల గ్యాప్ వుంది. ఆ టైమ్ లోగా ఈ సమస్యను సాల్వ్ చేయాల్సి వుంటుంది.