పవన్ తో సినిమా.. నా బ్యాడ్ లక్

పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనేది దాదాపు ప్రతి దర్శకుడి కల. కానీ అది కొందరికే సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే, కెరీర్ లో పవన్ చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆయనతో యాక్సెస్…

పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనేది దాదాపు ప్రతి దర్శకుడి కల. కానీ అది కొందరికే సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే, కెరీర్ లో పవన్ చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆయనతో యాక్సెస్ చాలామందికి దొరకలేదు.

అయితే పవన్ తో పరిచయం, అంతోఇంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సినిమా సెట్ చేసుకోలేకపోయిన దర్శకులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు దర్శకుడు కృష్ణవంశీ.

మెగా కాంపౌండ్ కు కృష్ణవంశీ చాలా క్లోజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు చిరంజీవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రామ్ చరణ్ తో ఆయన సినిమా కూడా చేశాడు. అయితే పవన్ తో మాత్రం ఆయన సినిమా చేయలేకపోయాడు.

ఇదే విషయంపై తాజాగా స్పందించాడు కృష్ణవంశీ. కలిసి ఓ సినిమా చేయాలని ఇద్దరూ అనుకున్నారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా పవన్ తో సినిమా మిస్సయింది.

పవన్ కల్యాణ్ కోసం అనుకున్న కథతో సినిమా చేస్తే అది పెద్ద బ్లాస్ట్ అయి ఉండేదని, తన దురదృష్టం కొద్దీ పవన్ తో సినిమా చేయలేకపోయానని బాధపడ్డాడు కృష్ణవంశీ.

కృష్ణవంశీ-మహేష్ కాంబోలో తెరకెక్కిన మురారి సినిమా రీ-రిలీజైంది. స్ట్రయిట్ రిలీజెస్ కంటే, ఈ రీ-రిలీజ్ కు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కొడుకు గౌతమ్ తో మురారి సీక్వెల్ చేయమని చాలామంది ఈ దర్శకుడ్ని కోరుతున్నారు. అయితే అది డిసైడ్ చేయాల్సింది తను కాదని, మహేష్-నమ్రత కలిసి ఆ నిర్ణయం తీసుకుంటారని అన్నాడు కృష్ణవంశీ.

5 Replies to “పవన్ తో సినిమా.. నా బ్యాడ్ లక్”

Comments are closed.