టీటీడీలో ఇంజినీర్ల గోడు వర్ణనాతీతంగా వుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైంది. ధర్మారెడ్డి ఏలుబడిలో అన్ని రకాల ఉద్యోగులు ఎందుకనో అసౌకర్యంగా ఫీల్ అవుతూ వచ్చారు. తమ మానసిక వేదనకు ధర్మారెడ్డే కారణమని టీటీడీ ఉద్యోగులంతా బలంగా నమ్మారు. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీలో కొనసాగకుండా చేయాలంటే, జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని టీటీడీ ఉద్యోగులు భావించారు. టీటీడీలో మెజార్టీ ఉద్యోగులంతా కూటమికి అండగా నిలిచారు.
దీంతో టీటీడీ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ముఖ్యంగా టీటీడీ ఇంజినీర్లను విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఇప్పటికే వాళ్లందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు రెండు రోజుల క్రితం పెన్‌డౌన్ చేపట్టారు. ధర్మారెడ్డి పాలనలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదు. పట్టుమని రెండు నెలల కూటమి పాలన టీటీడీ ఇంజినీర్లను ఉద్యమ బాట పట్టించింది.
తాజాగా ఇంజినీర్లంతా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని కలిశారు. టీటీడీ పాలక మండలి చేసిన తీర్మానాల్ని అమలు చేయడమే తమ ఉద్యోగ ధర్మమని, పనులు చేసినందుకు నోటీసులు ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యేని నిలదీసినట్టు తెలిసింది.
ఇలాగైతే త్వరలో ఏర్పడబోవు టీటీడీ పాలక మండలి తీర్మానాల్ని కూడా అమలు చేయలేమని ఎమ్మెల్యేకి ఇంజినీర్లు తేల్చి చెప్పినట్టు తెలిసింది. మరికొందరు ఇంజినీర్లు ఈ వేధింపుల్ని తట్టుకోలేక, దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నారని సమాచారం. ఎవరినో టార్గెట్ చేయబోయి, అనవసరంగా కూటమి టీటీడీ ఉద్యోగులకు వ్యతిరేకమైందనే చర్చకు తెరలేచింది.
Call boy jobs available 8341510897
Criminal Jagan = anti-India Jagan
Jagan dedicated his life to crimes and factionalism…
He is hero to a section of the society!
Vc estanu 9380537747