నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుక్షణం నుంచి వాళ్ల జాతకాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ విడిపోతారంటూ వేణుస్వామి బాహాటంగా ప్రకటించాడు. ఇక అతడిపై ఓ జర్నలిస్ట్ సంఘం కేసు కూడా వేసింది.
ఇలా చైతన్యశోభితంగా నిశ్చితార్థం చేసుకున్న వీళ్లిద్దరూ చుట్టూ నానా హంగామా నడుస్తోంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే, అసలు నాగచైతన్యకు జాతకాలపై నమ్మకం ఉందా? అతడు నిజంగా జాతకాలు, ముహూర్తాలు నమ్ముతాడా?
దీనికి నాగచైతన్య దగ్గర 2 విభిన్న సమాధానాలున్నాయి. గతంలో ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య, రానా మాట్లాడుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో జాతకాలపై స్పందించాడు నాగచైతన్య. తనకు అనుకూలంగా ఉంటే నమ్ముతానని, ప్రతికూలంగా ఉంటే నమ్మనని అన్నాడు.
ఇలా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. మరో సందర్భంలో సీరియస్ గానే మాట్లాడాడు. మన పెద్దలు నమ్ముతున్నారు కానీ తను కూడా నమ్ముతానని అన్నాడు. అయితే ప్రతి రోజూ జాతకం చూసుకునే టైపు కాదని.. ఏదైనా శుభకార్యం ఉంటే కచ్చితంగా ముహూర్తం చూసుకుంటాం అనేది అతడి మాట.
8.8.8 (ఆగస్ట్ 8, 2024) అనే ముహూర్తంలో వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతమంది పండితులు ఈ తేదీ మంచిదే అంటున్నారు, మరికొందరు మాత్రం చెడు అంటున్నారు. ఇలాంటి ముహూర్తాలు, జాతకాల్ని బాగా పట్టించుకునే ఫ్యామిలీ నుంచి వచ్చింది శోభిత. కాబట్టి అన్నీ చూసుకొని ఈ తేదీకి ఫిక్స్ అయి ఉంటారు.
Call boy works 8341510897
call boy 8328226808
Naga chaitnya nasthikudu illanti jathakalu nammadu A. N.R kuda nasthikudu devudni nammadu
Vc available 9380537747
జనం పట్టించుకోరు
Akkinneni good family Samantha kuda inkko marriage chesukoni happy ga vundachu