ప్రభాస్ కోసం అతిపెద్ద సెట్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారనే విషయం తెలిసిందే. అయితే అది ఎంత భారీ అనేది ఎవ్వరికీ తెలియదు. Advertisement తొలిసారి…

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారనే విషయం తెలిసిందే. అయితే అది ఎంత భారీ అనేది ఎవ్వరికీ తెలియదు.

తొలిసారి రాజాసాబ్ సెట్స్ పైకి స్పందించాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇండియాలోనే అతిపెద్ద సెట్ ను రాజాసాబ్ కోసం వేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఇండోర్ లో ఇంత పెద్ద సెట్ ఎవ్వరూ వేయలేదంట.

“రాజా సాబ్ కోసం భారీ సెట్ వేశాం. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇండోర్ లో ఇంత పెద్ద సెట్ ఎవ్వరూ వేయలేదు. రాజాసాబ్ కోసం 40వేల చదరపు అడుగుల ఫ్లోర్ లో అతి భారీ సెట్ ఇది. సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అందులోనే జరుగుతోంది. ఇప్పటివరకు ఇండియాలో ఇంత సైజ్ ఫ్లోర్ లేదు. ప్రభాస్ సినిమా కోసమే ప్రత్యేకంగా నిర్మించాం. ఇది కాకుండా ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి. మేజర్ హైలెట్ మాత్రం ఈ భారీ సెట్ అవుతుంది.”

హారర్-కామెడీ ఎలిమెంట్స్ తో సాగే రాజాసాబ్ సినిమా ఓ పెద్ద కోట చుట్టూ తిరుగుతుంది. విశ్వప్రసాద్ చెప్పింది ఆ కోట సెట్ గురించే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయింది. అక్టోబర్ చివరి నాటికి టాకీ అయిపోయింది. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ ఉంటుంది.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోందని, గ్రాఫిక్స్ కోసం ఇవ్వాల్సిన మెటీరియల్ కు సంబంధించి ఆల్రెడీ షూట్ పూర్తిచేశామని నిర్మాత వెల్లడించారు. కాబట్టి ఎలాంటి డిలే ఉండదని, ఏప్రిల్ 10న రాజాసాబ్ థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

3 Replies to “ప్రభాస్ కోసం అతిపెద్ద సెట్”

Comments are closed.