తెలంగాణలోనూ ఏపీ ప్రయోగం… కాంగ్రెస్ కు ఇబ్బందులేనా?

మొన్నటి అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. అది రాజకీయ ప్రయోగం. ఏమిటా ప్రయోగం? అందరికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన…

మొన్నటి అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. అది రాజకీయ ప్రయోగం. ఏమిటా ప్రయోగం? అందరికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. వై నాట్ 175? అంటూ నినదించిన జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది.

ఇప్పుడు అదే ప్రయోగాన్ని తెలంగాణలోనూ చేయాలని టీడీపీ అండ్ బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించి ఊపు మీద ఉంది. ఏపీలో టీడీపీ కూడా ఊపు మీద ఉంది. తెలంగాణలో జనసేన లేదు కాబట్టి ఆ పార్టీ వీళ్ళతో పొత్తులో లేదు.

ఈ హడావుడి దేనికంటే తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయట. తెలంగాణలో అధికారం సాధించి, పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు సాధించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయ పతాక ఎగరేయాలని పట్టుదల మీద ఉంది.

సో .. ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు పుట్టుకొచ్చాయి. చాలాకాలంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటేనని గులాబీ పార్టీ నాయకులు పాడుతుంటే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వారు పాడుతున్నారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తమ వాదనను జస్టిఫై చేసుకోవడానికి అనేక ఉదంతాలు, ఉదాహరణలు చూపిస్తున్నారు.

కానీ ఇప్పుడు టీడీపీ -బీజేపీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆ వాదనలు డొల్ల అని తేలిపోయింది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని రాష్ట్ర టీడీపీ నాయకులు బాబును అడిగారు. కానీ ఆయన నిరాకరించాడు. అందుకు కొన్ని కారణాలు చెప్పాడు. అసలు కారణం ఏమిటంటే …కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని, టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వెళ్లి బాబును వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

పూర్వాశ్రమంలో ఇద్దరూ గురు శిష్యులు అని అంటారు కదా. రేవంత్ రెడ్డి అభ్యర్థనను బాబు మన్నించాడని అంటారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా. మరి ఈ పొత్తు మీద రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.

8 Replies to “తెలంగాణలోనూ ఏపీ ప్రయోగం… కాంగ్రెస్ కు ఇబ్బందులేనా?”

  1. అనవసరం, ఏపీ తెలంగాణా భేదాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది, బీజేపీ ని ముందు పెట్టి బీజేపీ కి సపోర్ట్ చెయ్యడమే మంచిది.

Comments are closed.