ఓ సినిమాకు మరో సినిమా పోటీ ఇవ్వడం సహజం. అయితే విశ్వక్ సేన్ సినిమాకు మాత్రం ఊహించని వింత పోటీ ఎదురైంది.
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా లైలా వస్తోంది. దీంతో పాటు బ్రహ్మ-ఆనందం అనే సినిమా రిలీజ్ అవుతోంది. దిల్ రూబ వాయిదా పడింది. దీంతో లైలా సినిమాకు పోటీ కాస్త తక్కువగానే ఉందనుకోవచ్చు.
కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, విశ్వక్ సేన్ కు ఈసారి రీ-రిలీజ్ ల నుంచి పోటీ గట్టిగా ఉంది. వాలంటైన్స్ డే వీక్ కావడంతో.. ఆరెంజ్, ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఆల్రెడీ థియేటర్లలో ఉంది.
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను వాలంటైన్స్ డే సందర్భంగా సెలబ్రేట్ చేయాలని మెగా ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి 2 కారణాలు. ఒకటి గేమ్ ఛేంజర్ నిరాశపరచగా, రెండోది ఆరెంజ్ సినిమా అప్పట్లో ఫ్లాప్. కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ సినిమాను ట్రెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ అయింది.
ఇక సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా చూడ్డానికి ఆల్రెడీ ఓ సెక్షన్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక మూడోది ‘ఇట్స్ కాంప్లికేటెడ్’. ఐదేళ్ల కిందటొచ్చిన ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాను పేరు మార్చి ఇలా రిలీజ్ చేస్తున్నారు. ప్రచారమైతే భారీగా చేస్తున్నారు. థియేటర్లకు ఏ మేరకు జనాలు వస్తారో చెప్పమంటే మాత్రం ఇట్స్ కాంప్లికేటెడ్.
ఇలా 3 రీ-రిలీజెస్ మధ్య వస్తోంది లైలా చిత్రం. తల, నిదురించు జహాపన, బ్రహ్మ-ఆనందం లాంటి స్ట్రయిట్ రిలీజెస్ ఉండనే ఉన్నాయి. అసలే ఓవైపు బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది, మరోవైపు ఈ రీ-రిలీజులు. లైలా ఏమౌతుందో చూడాలి.
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
Waiting