విశ్వక్ సేన్ నుంచి రీసెంట్ గా రిలీజైన చిత్రం మెకానిక్ రాకీ. ప్రేక్షకులకు కచ్చితంగా థ్రిల్ ఇస్తుందనుకున్న ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ విషయాన్ని విశ్వక్ అంగీకరించాడు. ఒక్కోసారి లెక్కలు మారుతాయంటున్నాడు.
“ఒకటి లేదా రెండు సినిమాలుంటాయి. ఎవడి కెరీర్ లోనైనా ఒకట్రెండు సినిమాలు మధ్యలో వస్తుంటాయి. ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకున్నదే. ఎవరూ ఫ్లాప్ కావాలని కోరుకోరు కదా. మెకానిక్ రాకీ సినిమాను చాలా నమ్మి చేశాను. కానీ ఒక్కోసారి లెక్కలు మారతాయి. ఎవడూ దేవుడు కాదు కదా. మనుషులే తప్పులు చేస్తారు.”
ప్రతి హీరోకు డిప్ ఉంటుందని, డిప్ ఉన్నప్పుడే రెయిజ్ ఉంటుందని అంటున్నాడు విశ్వక్ సేన్. గామిలాంటి ప్రయోగాత్మక సినిమా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేసిన తను మధ్యలో మెకానిక్ రాకీ లాంటి ఫ్లాప్ సినిమా తీశానని, ప్రతి సినిమాను హిట్ చేయడానికి తన దగ్గర అతీత శక్తులు లేవని అంటున్నాడు.
మెకానిక్ రాకీని ప్రేక్షకులు మెకానిక్ దగ్గరకు పంపించారని.. ఇప్పుడు లైలా సినిమాపై నమ్మకంగా ఉన్నానని అంటున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ లో కంటెంట్ రొటీన్ గా ఉందనే వాదనను తోసిపుచ్చుతున్నాడు. విడుదలకు ముందే లైలా సినిమాను రొట్ట సినిమా అనే ముద్ర వేయొద్దని, సినిమా రొటీన్ గా ఉండదని అంటున్నాడు.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,