కూటమి సర్కార్ లోనూ రాజుగారు బాధితుడేనా?

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు తన బాధని బయటకు చెప్పలేక సన్నిహితులతో చెప్పుకుంటున్నారుట. ఆయన బీజేపీ తరఫున తొలిసారి 2014 నుంచి…

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు తన బాధని బయటకు చెప్పలేక సన్నిహితులతో చెప్పుకుంటున్నారుట. ఆయన బీజేపీ తరఫున తొలిసారి 2014 నుంచి 2019లో ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ క్లియర్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట.

ఆ మొత్తం 86 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ సర్కారు హయాంలో రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటూ రాజు గారు విమర్శలు చేశారు. దాంతో వైసీపీ హయాంలో ఆయన బిల్లులు క్లియర్ కాలేదు. పార్టీ మారితే ఇస్తామని అన్నారట. రాజు గారు మాత్రం ఆ పని చేయలేదని చెప్పుకున్నారు.

ఇపుడు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిదవ నెలలోకి ప్రవేశిస్తున్నా కూడా రాజు గారి బిల్లులు అలాగే పేరుకుని పోయాయట. వాటిని కూటమి ప్రభుత్వం పెద్దలు చెల్లించడం లేదని అలా చెల్లించకుండా విశాఖ జిల్లాకు చెందిన ఒక టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అడ్డుకుంటున్నారని రాజు గారి ఆవేదనతో పాటు ఫిర్యాదుగా ఉందిట.

పోనీ కొత్త పనులు అయినా ఇస్తే కొంత ఊరట అనుకుంటే కొత్తగా కాంట్రాక్టులు కూడా రాజు గారికి దక్కకుండా చేస్తున్నారుట. ఇదంతా కూటమిలోని కొందరు నాయకులే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారుట. దాంతో తాను అధికార పక్షంలో ఉన్నానా లేక ప్రతిపక్షంలో ఉన్నానా అన్నది అర్ధం కాక రాజు గారు ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం ఉన్న రాజు గారి వైఖరి కొందరికి గిట్టడం లేదు. పైగా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ పలుకుబడిని పెంచుకోవడం గిట్టని వారే కూటమిలో కుంపట్లు పెడుతున్నారని అంటున్నారు.

One Reply to “కూటమి సర్కార్ లోనూ రాజుగారు బాధితుడేనా?”

Comments are closed.