పవన్ అనారోగ్యం.. ఏం జరుగుతోంది?

అమరావతి మీడియా పవన్ దైనందిన అధికారిక కార్యక్రమాలను పక్కాగా రిపోర్ట్ చేయాల్సి వుంది. అప్పుడు జనాలకు ఓ అవగాహన వస్తుంది.

నిత్యం పత్రికలు చదివేవారికి ఏపీలో ఏం జరుగుతోందో అన్న అనుమానం కలగడం సహజం. మూడు కీలక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్. కానీ పదిహేను రోజులకో, నెల రోజులకో ఒక్కసారి ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారనో, ఆయన ఎక్కడికో వెళ్లారనో కనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ఆయన ఎక్కడ ఉన్నారు? అన్నది కూడా తెలియదు.

నిజానికి అంత కీలక మంత్రి, అదీ డిప్యూటీ ముఖ్యమంత్రి కావడంతో, నిత్యం ఏదో ఒక రివ్యూ మీటింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే, ఏదో ఒక కీలక నిర్ణయం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పత్రికల్లో కనిపించవు, జరుగుతున్నాయా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రం రాష్ట్రానికి ఏ నిధులు విడుదలైనా, పవన్ కళ్యాణ్ ఫొటోతో ఓ పోస్టర్ మాత్రం వస్తుంది.

పవన్ మంగళగిరిలో ఉన్నారో, హైదరాబాద్‌లో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో ఎవరికీ తెలియదు. అలాంటిది, మంత్రివర్గ సమావేశానికి ముందుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదని ఓ నోట్ వచ్చింది. కేవలం ఆ నోట్ మాత్రమే వచ్చి వుంటే వేరే సంగతి, దానితో పాటు మంత్రివర్గ సమావేశానికి హాజరుకావడం లేదని కూడా జతచేశారు.

దాదాపు మీడియా అంతా “అనారోగ్య కారణంగా పవన్ మంత్రివర్గ సమావేశానికి రాలేదు” అని హైలైట్ చేసింది. ఈ నోట్ రాకుండా ఉంటే, “డిప్యూటీ సీఎం మంత్రివర్గ సమావేశానికి ఎందుకు రాలేదు?” అనే వార్తలు వచ్చే అవకాశం ఉండేది.

గమ్మత్తేమిటంటే, ఆ నోట్ డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచి వచ్చింది కనుకే అది పెద్దగా వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత పవన్ నేతృత్వంలోని మూడు కీలక శాఖల్లో ఏం జరుగుతోంది? అన్న అప్‌డేట్ పత్రికల్లో కనిపించదు. “పవన్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆయన ఈ రోజునా అధికారులతో సమీక్ష నిర్వహించారు” అనే వార్తలు ఎక్కడా కనిపించవు.

భాజపా ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా పవన్ వెళ్లలేదు, కానీ చంద్రబాబు వెళ్లారు. లోకేష్ అయితే ఢిల్లీకి వెళ్లి పలువురు ప్రముఖులను కలిసి, రాష్ట్రానికి అవసరమైన అంశాలపై లాబీయింగ్ చేస్తున్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖ అంటే చాలా పెద్దది, అటవీ శాఖ కూడా అంతే విస్తృతమైనది. ఈ నేపథ్యంలో ఆ శాఖల్లో ఫైళ్లు క్లియర్ కావడం లేదని క్లారిటీ వచ్చింది. ఎంత ఎక్కువ ఫైళ్లు ఉన్నా, అధికారులు, మంత్రులు వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో పవన్ కు పదో ప్లేస్ వచ్చింది.

మరోపక్కన పవన్ నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈ సినిమా షూట్ కు పవన్ రావాల్సి వుంది. ఇప్పుడు పవన్ కనుక ఈ షూట్ లో పాల్గొంటారో లేదో తెలియదు. నిజానికి పాల్గొన్నా బయటకు రాదు. అంతా అయిపోయిన తరువాత అయిపోయింది అని నోట్ వస్తుంది. అవునా..ఎప్పుడు అయిందబ్బా అని ఆశ్చర్యపోవడం జనాల వంతు అవుతుంది.

ఏమైనా పవన్ కు, ఆయన మంత్రిత్వ శాఖలకు పత్రికల్లో కవరేజ్ పెరగాల్సి వుంది. అమరావతి మీడియా పవన్ దైనందిన అధికారిక కార్యక్రమాలను పక్కాగా రిపోర్ట్ చేయాల్సి వుంది. అప్పుడు జనాలకు ఓ అవగాహన వస్తుంది.

21 Replies to “పవన్ అనారోగ్యం.. ఏం జరుగుతోంది?”

  1. Pawan sir is working 24 X 7 without taking care of his health and hence he fell sick. That is his commitment to people. Get well soon sir. Public needs you and your energy. Without you state affairs have come to a standstill.

  2. ప్లే బాయ్ వర్క్ >> > ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Ante pawan sir em chesthunnado neeku avagahana ledu antav?? Anthega..

    5 years lo okka minister ina oka review meeting pettadam chusam?

    Press meet kani , press note kani chusama??

    Appudu legani noru ippudela lestundi ra labbe

Comments are closed.