శోభితతో పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితంపై స్పందించాడు హీరో నాగచైతన్య. ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ బాగుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అవసరమని అంటున్నాడు.
“శోభిత నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు కనిపిస్తోంది. ప్రతి విషయంలో ఆమె ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ప్రేమ ఉండాలి. మనం హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేమ ఉండాల్సిందే. నా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది.”
సమంతతో విడిపోయిన తర్వాత తక్కువ టైమ్ లోనే శోభితకు కనెక్ట్ అయ్యాడు నాగచైతన్య. ఇద్దరూ చాన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
తన ప్రేమ సంగతుల్ని ఇదివరకే బయటపెట్టాడు నాగచైతన్య. శోభిత కోసమే ప్రత్యేకంగా ముంబయి వెళ్లిన విషయాన్ని కూడా గతంలో వెల్లడించాడు. ఇప్పుడామెతో వైవాహిక బంధం కూడా ప్రేమగా సాగిపోతోందని చెబుతున్నాడు.
తండేల్ సినిమా ప్రచారంలో భాగంగా ఇలా తన వైవాహిక జీవితంపై స్పందించాడు నాగచైతన్య. ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకొచ్చింది.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
పోనీ మీ నాన్న లాగా.. సమంతను మోసగించి ఇతర అమ్మాయిలతో గడిపినట్లు ఈమెకు కూడా మోసం చేయకుండా బాగా చూసుకో!