హీరోలు ఆడవేషం వేయడం కొత్త కాదు. కమల్, రాజేంద్రప్రసాద్, నరేష్, ఆలీ ఇలా అందరూ వేసారు. కథలో అవసరార్ధం ఆడవేషం కట్టడం అన్నది వాళ్లు వేసిన అన్ని సినిమాల్లో కామన్ పాయింట్. హీరో విష్వక్ సేన్ లేటెస్ట్ సినిమా లైలా కూడా ఇలాంటిదే. ట్రయిలర్ విడుదలయింది. ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి హీరో ఆడవేషం కడితే మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి అన్నది పాయింట్ అని ట్రయిలర్ లో చెప్పేసారు. అందువల్ల పాయింట్ గురించి డిస్కషన్ అక్కరలేదు.
మరి మిగిలిన ట్రయిలర్ ఎలా వుంది? అది కదా పాయింట్. సినిమా ఎలా వుండబోతోందో చెప్పేది ట్రయిలర్ నే కదా. కుర్రకారును నవ్వించడం మాత్రమే అల్టిమేట్ గోల్ అనేలా వుండబోతుందీ సినిమా అని ట్రయిలర్ చెబుతోంది. కొన్ని సీన్లు చూసి క్రింజ్ అంటారో, రొట్ట అంటారో, బి గ్రేడ్ అంటారో.. అది మీ ఇష్టం. మా పర్సస్ మాత్రం జనాలు నవ్వుకోవాలి. థియేటర్లు నిండాలి అని టీమ్ డిసైడ్ అయినట్లు వుంది.
ఒకటిరెండు మినహా విష్వక్ సేన్ సినిమాలు అంటే కాస్త నాటు బూతుల తిట్లు కామన్. ఈ ట్రయిలర్ కు డబుల్ మీనింగ్ డైలాగులు అదనం. లోపల పువ్వులేదు కాయ వుంది. చాతీ చపాతీ అవుతుంది.. ఇలా ఏరుకున్నవారికి ఏరుకున్నన్ని డైలాగులు.
సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు కనుక ఇక పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఈ జోనర్ సినిమా నచ్చేవాళ్లు హ్యాపీగా చూడడమే. అలా అని కమల్ భామనే సత్యభామనే.. రాజేంద్ర ప్రసాద్ మేడమ్ నో ఊహించుకోనక్కరలేదు. ఆలీ కామెడీగా ఆడ గెటప్ లో కనిపించిన వైనం గుర్తు తెచ్చుకోండి. అంతకన్నా బెటర్ గా వుందని హ్యాపీగా ఫీల్ కండి.
nine, nine, eight, nine, zero, six, four, two, five, five :-
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc
ప్లే బాయ్ వర్క్ >>
Pitta
dcm taluka 
