వామ్మో మస్తాన్.. ఫోన్ లోనే దుకాణం తెరిచాడు

మస్తాన్ సాయికి చెందిన ఫోన్ లో వందల కొద్దీ అమ్మాయిల వీడియోలు బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ లో చూసిన వీడియోలకు ఇవి అదనం.

మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు లావణ్య అప్పగించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఆమె మస్తాన్ సాయిపై కేసు పెట్టింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు, మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు.

అతడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే పోలీసులకు మరోసారి దిమ్మతిరిగింది. మస్తాన్ సాయికి చెందిన ఫోన్ లో వందల కొద్దీ అమ్మాయిల వీడియోలు బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ లో చూసిన వీడియోలకు ఇవి అదనం.

హార్డ్ డిస్క్ లో పాత పరిచయాలు, పాత వీడియోల్ని చూసిన పోలీసులు.. మస్తాన్ ఫోన్ లో తాజా వీడియోలు, తాజా పరిచయాలున్నట్టు కనుగొన్నారు. అంతేకాదు, అతడి మొబైల్ లో వేలాది మంది అమ్మాయిల కాంటాక్ట్ నంబర్లున్నాయి. ప్రతి అమ్మాయిని ఊరు పేరు లేదా ఇంటి పేరుతో సేవ్ చేసినట్టు గుర్తించారు.

ప్రస్తుతం హార్డ్ డిస్క్ తో పాటు మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరోవైపు డ్రగ్స్ కొనుగోలు-అమ్మకానికి సంబంధించి ప్రశ్నించేందుకు మస్తాన్ సాయిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు పోలీసులు.

4 Replies to “వామ్మో మస్తాన్.. ఫోన్ లోనే దుకాణం తెరిచాడు”

Comments are closed.