సినిమాలు కాకుండా ఏమిష్టం?

సన్ స్క్రీన్ లోషన్స్ పెద్దగా వాడను.. కేవలం మాయిశ్చరైజర్లు మాత్రమే వాడతాను. అవి కూడా తక్కువ. సీజనల్ గా ఉపయోగిస్తానంతే.

ఈమధ్య తేనెటీగల పెంపకం మొదలుపెట్టాను. కాకపోతే ఇంకా పూర్తిస్థాయిలో పట్టు రాలేదు. ప్రయత్నిస్తున్నాను.

ఇష్టమైన ఆహార పదార్థం..

బన్ మస్కా అంటే ఇష్టం.. కొబ్బరి నీళ్లు కూడా ఇష్టం

ఇష్టమైన అలవాటు..

రాత్రి 9 గంటలకే పడుకుంటా. ఎక్కడున్నా, ఏం చేసినా ఈ అలవాటు మాత్రం మానుకోను.

సన్ స్క్రీన్ లోషన్..

సన్ స్క్రీన్ లోషన్స్ పెద్దగా వాడను.. కేవలం మాయిశ్చరైజర్లు మాత్రమే వాడతాను. అవి కూడా తక్కువ. సీజనల్ గా ఉపయోగిస్తానంతే.

సినిమా డైరక్షన్ అంటే ఇష్టమా..

సినిమా డైరక్ట్ చేసే అవకాశం లేదు. ఆ పని మాత్రం చేయను.

ఏ ఫిక్షనల్ పాత్రతో డిన్నర్ చేయాలనుకుంటారు..

ఫిక్షనల్ పాత్రతో డిన్నర్ చేసే అవకాశం వస్తే, ది సింప్సన్స్ కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తాను. (అమెరికన్ యానిమేషన్ పాత్రలు)

శ్రీకాకుళం యాస ఎలా ప్రాక్టీస్ చేశారు

యాస చాలా కఠినంగా ఉంది. ఇప్పటికే నాకు తెలంగాణ యాస వచ్చు. నేను బాగా నేర్చుకున్నాను. అయినప్పటికీ, శ్రీకాకుళం యాస పట్టుకోవడం చాలా కష్టమైంది. మొత్తానికి ఎలాగోలా నేర్చుకున్నాను.

ఫ్రీ టైమ్ లో ఏం చేస్తారు?

ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. లేదంటే సినిమాలు చూస్తాను. వంట చేయాలనుకుంటాను కానీ చేయను. తోటకు వెళ్తాను, అక్కడ జరిగే అగ్రికల్చర్ పనులు చూస్తుంటాను. ప్యాషన్ ఫ్రూట్స్ కోసుకొని తినడం ఇష్టం.

ఇష్టమైన వాట్సాప్ స్టిక్కర్

త్రీ మంకీస్ స్టిక్కర్స్ ఎక్కువగా వాడుతుంటాను. ఎవరికైనా ఎమోజీ రిప్లయ్ ఇవ్వాలంటే వీటినే ఎక్కువగా ఉపయోగిస్తాను.

అబ్బాయిలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇష్టం

ఆ విషయం నేను చెప్పలేను. కానీ ఏ దుస్తులైనా ఇస్త్రీవి వేసుకోవాలి. ఇస్త్రీ చేయకుండా ముడతలు పడిన దుస్తులు వేసుకుంటే నాకు నచ్చదు. మా ఇంట్లో కూడా ఇస్త్రీ బట్టలు వేసుకున్నారా లేదా అని చూస్తాను. ఎవరైనా ఇస్త్రీ బట్టలు వేసుకోకపోతే, నేనే ఇస్త్రీ చేసి ఇస్తాను.

3 Replies to “సినిమాలు కాకుండా ఏమిష్టం?”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

Comments are closed.