బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ స‌రే.. అధికారం ఎక్క‌డ‌?

బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం ఓకే… వాళ్ల చేతికి ఇవ్వాల్సింది ప్ర‌ధానంగా అధికారం.

ఏపీ కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. అణ‌గారిన వ‌ర్గాల‌కు పాల‌కులు అండ‌గా నిల‌బ‌డ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తిస్తారు. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు.

అయితే బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం ఓకే… వాళ్ల చేతికి ఇవ్వాల్సింది ప్ర‌ధానంగా అధికారం. ఉదాహ‌ర‌ణ‌కు కూట‌మి ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను కాద‌ని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి వుందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో రిజ‌ర్వేష‌న్ల‌కు మించి బీసీల‌కు ప‌ద‌వుల్ని క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కింది.

స్థానిక సంస్థ‌ల్లో అగ్ర వ‌ర్ణాల‌కు రిజ‌ర్వ్ చేసిన మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో సైతం చైర్మ‌న్ల‌గా, మేయ‌ర్ల‌గా బీసీల‌ను వైసీపీ నియ‌మించింది. కానీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రోలా ఉన్నాయి. కేవ‌లం గ‌ణాంకాల కోసం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డం కాకుండా, ప‌వ‌ర్ వాళ్ల చేతికి ఇస్తేనే ఆ వ‌ర్గాల్లో ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఎన్టీఆర్ హ‌యాంలో టీడీపీ అంటే బీసీల పార్టీగా గుర్తింపు పొందిందన్న విష‌యం వాస్త‌వం.

కానీ టీడీపీలో అధికార మార్పిడి జ‌రిగిన త‌ర్వాత‌, కార్పొరేట్ శ‌క్తుల‌కు ప్రాధాన్యం పెరిగింద‌న్న విమ‌ర్శ బ‌లంగా ఉంది. వాళ్లే ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో రాజ్యం ఏలుతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కావున రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి, అధికారాన్ని త‌మ చేత‌ల్లో పెట్టుకుంటే ప్ర‌యోజ‌నం వుండ‌దు. అధికారాన్ని కూడా బ‌దిలీ చేసిన‌ప్పుడే రిజ‌ర్వేష‌న్ల‌కు సార్థ‌క‌త ల‌భిస్తుంది.

8 Replies to “బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ స‌రే.. అధికారం ఎక్క‌డ‌?”

    1. 2.0 అంటే అదే..

      అధికారం బీసీ లకు ఇచ్చేసి.. మా జగన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోతాడు..

      ..

      ఈ ముద్రగడలు, ప్రత్యేక రాయలసీమ లు.. అన్నీ టీడీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడే చెలరేగుతారు..

      జగన్ రెడ్డి, వైఎస్సార్ అధికారం లో ఉన్నప్పుడు అన్నీ మూసుకుని ఉంటారు..

      1. వాళ్ళు అధికారం లో ఉన్నప్పుడు ఎవరైనా సరే వంగి దండాలు పెట్టాలి లేకపోతే సాల్తి గల్లంత్ అవుతుంది..

  1. GA గాడి వంకలు, బొంకులు…

    .

    Chandrababu 34% శాతం రిసెర్వెషన్ BC లకి ఇచ్చారు కాని… CM పదవి ఇవ్వలెదా?

    రైల్వే జొనె ఇచ్చారు కానీ …

    విశాక స్టీల్ ప్లాంటికి 11,400 కొట్లు ఇచ్చారు కాని …

    రాజదానికి 15 వెల కొట్ల అప్పు కెంద్రమె భరిస్తుంది కాని ..

    ఆమరావతికి ORR కెంద్రమె భరిస్తుంది కాని ..

    పొలవరం మళ్ళి మొదలు పెడుతున్నారు కాని …

    గ్రీన్ హైడ్రొజెన్ హబ్ మొదలు పెడుతున్నారు కాని …..

    .

    వీడు పెట్టె వంకలు అన్ని ఇన్ని కావు! ఇవె పనులు Jagan చెస్తె.. వీడి డప్పుకి అవదులె ఉండెవి కాదు!

  2. ఛైర్మన్ సీటు లో కుర్చోబెట్టి పెత్తనం మాత్రం వీళ్ళే చేసేవారు

Comments are closed.