ముంబయి రియల్ ఎస్టేట్‌పై మాఫియా దెబ్బ

ముంబయిలో ఖరీదైన ప్రాపర్టీలు కొనేవాళ్లలో ముందు వరసలో వ్యాపారవేత్తలుంటే, ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ ప్రముఖులుంటారు.

టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత బాలీవుడ్ వర్గాల్లో భయాలు పెరిగాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రమేయంతో జరిగిన ఈ దాడి ప్రభావం ముంబయి రియల్ ఎస్టేట్‌పై పడింది.

చాలామంది బాలీవుడ్ స్టార్స్, ముంబయిని వీడుతున్నారనే ప్రచారం, రియల్ ఎస్టేట్‌ను వణికిస్తోంది.

టైగర్ ష్రాఫ్ ముంబైలోని తన ప్రాపర్టీని అమ్మేశాడని, సల్మాన్ ఖాన్ తన అపార్ట్‌మెంట్‌ను విక్రయించి పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలు రియల్ ఎస్టేట్‌ మార్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి.

ముంబయిలో ఖరీదైన ప్రాపర్టీలు కొనేవాళ్లలో ముందు వరసలో వ్యాపారవేత్తలుంటే, ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ ప్రముఖులుంటారు.

తమ సంపాదనలో చాలా మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌పై పెడుతుంటారు బాలీవుడ్ తారలు. ఫ్లాట్స్ అమ్మకం, కొనుగోళ్లు ముంబయిలో సర్వసాధారణం.

ఇలా రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్న బాలీవుడ్ జనం, ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుంటే, మార్కెట్ కుప్పకూలడం ఖాయం అంటున్నారు రియల్టర్లు.

సల్మాన్ ఖాన్ ముంబయిని వదిలి పంజాబ్‌లో రూ.2,500 కోట్ల పెట్టుబడితో 6 టవర్ల భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సల్మాన్ ఖాన్ టవర్స్ అని పేరు కూడా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

అటు షారూక్ ఖాన్, అమీర్ లాంటి ఇతర నటులు కూడా తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్ని హోల్డ్‌లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

సెలబ్రిటీలు తమ ఖరీదైన ఫ్లాట్లు, బంగ్లాలు విక్రయించి డబ్బును పంజాబ్ వంటి ప్రాంతాలకు తరలించడంతో ముంబైలో మార్కెట్లపై ఒత్తిడి పడుతోంది.

ఒకప్పుడు బాలీవుడ్ కేంద్రంగా ఉన్న నగరంలో ఇప్పుడు భద్రతా సమస్యలు ఎక్కువవ్వడం రియల్ ఎస్టేట్ రంగాన్ని టెన్షన్‌లోకి నెడుతోంది.

గ్యాంగ్‌ల బెదిరింపులు ఇలా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేయడం కొత్త కాదు. గతంలో కూడా అండర్‌ వరల్డ్ ఒత్తిడి కారణంగా కొందరు ప్రముఖులు తమ ఆస్తుల్ని ముంబయి వెలుపలకు తరలించిన సందర్భాలున్నాయి.

ఆ పరిస్థితి మరోసారి రిపీట్ అయ్యేలా ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. భద్రత లేని చోట డబ్బు నిలవదని అందుకే అంటారు.

One Reply to “ముంబయి రియల్ ఎస్టేట్‌పై మాఫియా దెబ్బ”

Comments are closed.