ఏళ్లుగా చాలామంది కలలుకన్న కాంబినేషన్ ఇది. నిజానికి కొన్నేళ్ల కిందట మారుతితో ప్రభాస్ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు చాలామంది ప్రస్తావించిన పేరు కూడా ఇది.
మారుతి స్థానంలో త్రివిక్రమ్ కు అవకాశం ఇవ్వాలని, కాస్త లేట్ అయినా సినిమా చేయాలని చాలామంది రెబల్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు స్వయంగా త్రివిక్రమ్, ప్రభాస్ తో సినిమాపై స్పందించారు. ప్రభాస్ లోని హ్యూమర్ యాంగిల్ ను ఎవరూ పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేదని… తను సినిమా చేస్తే, యాక్షన్-ఎమోషన్ తో పాటు మంచి కామెడీ ఉండేలా ప్రభాస్ తో సినిమా చేస్తానని త్రివిక్రమ్ ప్రకటించారు.
త్రివిక్రమ్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ పై చర్చ మరోసారి మొదలైంది. ఓ వైపు వరుసగా యాక్షన్, లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్, త్రివిక్రమ్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అతడి ఫ్యాన్స్ కోరుతున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం కూడా కష్టమే. ఎందుకంటే, ఆదర్శ కుటుంబం తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు త్రివిక్రమ్. దానికి కనీసం రెండేళ్లు పడుతుందని అంటున్నారు.
ఇక ప్రభాస్ సంగతి తెలిసిందే. ఫౌజీ, కల్కి-2, స్పిరిట్ సెట్స్ పై ఉన్నాయి. సలార్-2 కూడా సెట్స్ పైకి రాబోతోంది. సో.. వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగాల్సిందే.

Time over for treevikram..
Super combination!
బోయపాటి తో కూడా బాగుంటుంది