భార‌తీయుడ‌ని బిల్డ‌ప్‌.. టీడీపీ ఎమ్మెల్యేపై తిట్ల వ‌ర్షం!

గ‌తంలో ఎప్పుడూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అధికారం అడ్డు పెట్టుకుని చేసిన ఉదంతాలు లేవు.

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి నిజాయ‌తీప‌రుడ‌నే పేరు వుండేది. ప్ర‌స్తుతం ఆరో ద‌ఫా ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్రొద్దుటూరు నుంచి ఎంతో మంది టీడీపీ టికెట్‌ను ఆశించారు. అయితే వివిధ ర‌కాల స‌ర్వేలు చేయించి, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన వ‌ర‌ద‌రాజుల‌రెడ్డినే టికెట్ వ‌రించింది.

వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి లాంటి నిజాయ‌తీప‌రుడిని ఎన్నుకోవాల‌ని త‌ట‌స్థులు, రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచించి ముందుకు వ‌చ్చారు. సొంత ప్ర‌భుత్వంలో పోలీస్‌, రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్ ఇత‌ర‌త్రా గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వెంట్స్ అవినీతిపై వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, అవినీతికి పాల్ప‌డ‌మంటూ దేవునిపై ఆయ‌న ప్ర‌మాణం చేయించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అందుకే ఆయ‌న్ను భార‌తీయుడు సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పోల్చి మంచిగా మాట్లాడేవారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని గౌర‌వంగా సంబోధించేవారు.

అలాంటి వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ప‌రువు కాస్త ప్రొద్దుటూరు ప‌ట్ట‌న ఒడ్డునే ఉన్న పెన్నా న‌దిలో కొట్టుకుపోయింది. భార‌తీయుడు కాస్త‌, ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్ర‌జాప్ర‌తినిధిగా ప్రొద్దుటూరు స‌మాజం గుర్తిస్తోంది. వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిపై తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

బ‌హుశా రాజ‌కీయంగా వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి చివ‌రి ద‌శ‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 83 ఏళ్లు. ఎన్నిక‌లు వ‌చ్చే స‌మయానికి 86 ఏళ్లలో ప‌డుతారు. ఈ ద‌ఫా మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని అంటున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు వ్య‌వ‌హ‌రించిన దుర్మార్గంతో, ఇంత‌కాలం సంపాదించిన పేరు ప్ర‌తిష్ట‌లు మంట‌గ‌లిశాయి. ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో మొత్తం 52 వార్డులున్నాయి. ఇక్క‌డ వైసీపీ కూడా బ‌లంగా వుంది.

పోటీ ర‌స‌వ‌త్త‌రంగా వుంటుంద‌ని అంతా భావించారు. టీడీపీ త‌ర‌పున చైర్మ‌న్ అభ్య‌ర్థిగా వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి త‌మ్ముడు రాఘ‌వ‌రెడ్డి బ‌రిలో నిలిచారు. వైసీపీ త‌ర‌పున పోరెడ్డి న‌ర‌సింహారెడ్డి పోటీకి సై అన్నారు.

వైసీపీ త‌ర‌పున చైర్మ‌న్ అభ్య‌ర్థితో పాటు మ‌రో 36 మంది ఒకేసారి నామినేష‌న్లు వేశారు. చివ‌రి రోజు మిగిలిన వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే నామినేష‌న్లు వేయ‌కుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రొద్దుటూరులో పెద్ద ర‌చ్చే జ‌రిగింది. కానీ నామినేష‌న్లు వేయ‌లేక‌పోయారు.

ఆ త‌ర్వాత నామినేష‌న్ల ప‌రిశీల‌న‌లో వైసీపీ చైర్మ‌న్ అభ్య‌ర్థితో పాటు మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి భార్య ర‌మాదేవిది త‌ప్ప‌, మిగిలిన వారి నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ చైర్మ‌న్ అభ్య‌ర్థి పోరెడ్డిపై దాడి కూడా జ‌రిగింది. ఈ ప‌రిస్థితిలో తాను మాత్రం పోటీలో ఎందుకని రాచ‌మ‌ల్లు స‌తీమ‌ణి త‌న నామినేష‌న్‌ను విత్ డ్రా చేసుకుని నిర‌స‌న ప్ర‌క‌టించారు.

గ‌తంలో ఎప్పుడూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అధికారం అడ్డు పెట్టుకుని చేసిన ఉదంతాలు లేవు. ఇప్పుడా చెడు సంప్ర‌దాయానికి వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ఇది రానున్న రోజుల్లో ఎక్కడికి దారి తీస్తుందో చెప్ప‌లేని పరిస్థితి. అందుకే రాచ‌మ‌ల్లు ఒక హెచ్చ‌రిక చేశారు.

తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, మెట్టు (చెప్పు)తో కొట్టి ఏక‌గ్రీవం చేసుకున్నోళ్ల‌తో రాజీనామా చేయిస్తామ‌ని ఘాటు హెచ్చ‌రిక చేశారు. రాజ‌కీయ చ‌ర‌మాంకంలో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఎందుకింత దుర్మార్గానికి ఒడిగ‌ట్టార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డానికి ఆయ‌న‌కు మొహమెత్త‌డం లేదు.

ఇక‌పై అధికారుల్ని ఏమ‌ని బెదిరిస్తార‌ని పౌర స‌మాజం నిల‌దీస్తోంది. నైతికంగా ప‌త‌నం కావ‌డంతో మొన్న‌టి వ‌ర‌కు భార‌తీయుడు అని పొగిడిన నోళ్లే, నేడు ప్ర‌జాస్వామ్య వంచ‌కుడ‌ని తిట్ల వ‌ర్షం కురిపించ‌డంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

9 Replies to “భార‌తీయుడ‌ని బిల్డ‌ప్‌.. టీడీపీ ఎమ్మెల్యేపై తిట్ల వ‌ర్షం!”

  1. మన “తేడాసింహం” తన సొంత అడ్డా పులివెందులలో  

    “మగ సింహం”తో చీకట్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని “ప్యాలెస్ పెళ్ళానికి” రిపోర్ట్ వచ్చింది..

    అందుకే రాష్ట్రం లో ఎక్కడాలేని విధంగా కడప జిల్లాలో 85% ఛైర్మెన్ లు ఏకగ్రీవం అయ్యాయి

    ఇంతకీ

    ఎవరా మగ సింహం?

  2. “బర్రె”ప్రసాద్ రెడ్డి భార్య వరదారెడ్డితో చీకట్లో పిచికారీ చేసుకుని నామినేషన్ withdraw చేసుకుందట..  ఏరా బర్రె తొడలు కొట్టి సవాళ్ళు చేశావ్.. భయపడి పోటెచెయ్యకుండా ఏకగ్రీవం చేయించిన మా జేగను అండ్ పెద్దిరెడ్లని లంగాగాళ్ళు అన్నావ్.. చివరికి డబ్బుకోసం పెళ్ళాన్నే అమ్మేశావ్ కదరా?

  3. “బర్రె”ప్రసాద్ రెడ్డి భార్య వరదారెడ్డితో చీకట్లో పిచికారీ చేసుకుని నామినేషన్ withdraw చేసుకుందట.. 

    “ఏరా బర్రె”, తొడలు కొట్టి సవాళ్ళు చేశావ్.. భయపడి పోటీచెయ్యకుండా ఏకగ్రీవం చేయించిన మా జేగను అండ్ పెద్దిరెడ్లని లంగాగాళ్ళు అన్నావ్.. చివరికి డబ్బుకోసం నువ్వు పెళ్ళాన్నే అమ్మేశావ్ కదరా?

  4. 52 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయా.. నామినేషన్ వేయడం చేతకాకపోతే ఇంకేం పరిపాలన చేస్తారు.?కావాలనే ఇన్వాలిడ్ ఆర్ హాఫ్ ఇన్ఫో ఇచ్చి రిజెక్ట్ చేయించుకొని బయటికి వచ్చి అరుపులు…

  5. మరి రమా దేవి నామినేషన్ ఎందుకు reject అవ్వలేదు ? కరెక్ట్ గా ఉంది కాబట్టి, ఆవిడనే గెలిపించొచ్చు  కదా 

Comments are closed.