మంచి డాన్సర్.. మంచి నటి కూడా. కానీ సాయిపల్లవికి వచ్చేనెల 2 కఠిన పరీక్షలు ఎదురుకాబోతున్నాయి. ఎందుకంటే, ఆమె 2 ఛాలెంజింగ్ పాత్రలు పోషించింది. ఇంతకీ ఏంటా రోల్స్?
కొంతకాలంగా వెండితెరపై పెద్దగా కనిపించని ఈ టాలెంటెడ్ హీరోయిన్, ఇప్పుడు కేవలం రోజుల వ్యవధిలో 2 భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్రలే మెయిన్ హైలైట్ కానున్నాయి. దీంతో అందరి చూపు సాయిపల్లవిపై పడింది.
ఆమె తొలి ఛాలెంజ్ ‘రామాయణ’. ఇందులో సీతమ్మ పాత్రలో కనిపించింది సాయిపల్లవి. టీజర్ విడుదలైన సమయంలో ఆమె ఆహార్యంపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ, ఆ తర్వాత విడుదలైన ట్రైలర్, పాటలతో ఆ విమర్శలన్నీ కొట్టుకుపోయాయి.
ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఆమెను ట్రోల్ చేయాలని ఓ బ్యాచ్ కాచుకొని ఉంది. విమర్శకుల నోళ్లు మూయించే పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని యూనిట్ అంటోంది.
ఇక రెండో సినిమా ధనుష్ నటించిన ‘ఓం’. నవంబర్ చివర్లో వస్తోంది ఈ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో సాయిపల్లవి ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి ‘నిత్యారెడ్డి’ పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ లో సాయిపల్లవి అదరగొట్టింది. ఇన్నాళ్లూ క్యూట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ బ్యూటీ, ఇందులో ఫైట్స్ చేసింది. పైగా మమ్ముట్టి లాంటి దిగ్గజ నటులతో నటించింది.
గతేడాది ఫిబ్రవరిలో ‘తండేల్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సాయిపల్లవి. ఆ తర్వాత ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టినప్పటికీ అది డిజాస్టర్ అయింది.
ఇలాంటి టైమ్‌లో ఒకే నెలలో 2 సినిమాలతో థియేటర్లలోకి వస్తోంది పల్లవి. పైగా ఈ రెండు పాత్రలు ఛాలెంజింగ్ రోల్సే. ఈ కఠిన పరీక్షల్లో కూడా ఆమె పాస్ అవుతుందంటున్నారు సాయిపల్లవి అభిమానులు.

All the best dear!!