ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు, పోలీసులకు పెద్ద తేడా లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల్ని నిజం చేస్తూ నంద్యాల జిల్లాలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థితో కలిసి ఒక కానిస్టేబుల్ ప్రతిపక్ష జెడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌నకు యత్నించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రుద్రవరం వుంది. రుద్రవరం జెడ్పీటీసీ స్థానం నుంచి సీపీఐ తరపున భాస్కర్ బరిలో నిలిచారు. ఇవాళ విత్ డ్రాకు చివరి గడువు.
ఈ నేపథ్యంలో పోటీ నుంచి విరమించాలని సీపీఐ అభ్యర్థిపై టీడీపీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. అయితే పోటీ నుంచి తప్పుకోడానికి సీపీఐ అభ్యర్థి ససేమిరా అన్నారు.
దీంతో అతన్ని కిడ్నాప్ చేసి, భయపెట్టో, బెదిరించో పోటీ నుంచి తప్పించే కుట్రకు అధికార పార్టీ తెరలేపింది. సీపీఐ నేతల వివరాలిలా ఉన్నాయి.
నంద్యాలలో సీపీఐ కార్యాలయానికి గత రాత్రి కానిస్టేబుల్ ఓటులేసును వెంటబెట్టుకుని రుద్రవరం జెడ్పీటీసీ అభ్యర్థి రాజారావు వెళ్లారు. సీపీఐ అభ్యర్థి భాస్కర్‌ను బయటికి రావాలని వారు పిలిచారు. ఎస్ఐ పిలుస్తున్నారని, స్టేషన్‌కు రావాలని భాస్కర్‌తో కానిస్టేబుల్ అన్నారు.
ఇదే సందర్భంలో భాస్కర్‌ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడంతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడిని కూడా టీడీపీ అభ్యర్థి, కానిస్టేబుల్ బెదిరించారు. సీపీఐ నేతలపై దాడికి, బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో సీపీఐ నేతలు ఎదురు తిరిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. సీపీఐ నాయకుడు 100కు ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే రావడంతో కిడ్నాప్ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏపీలో నామినేషన్లు వేసిన ప్రతిపక్ష నేతలపై పోలీసులే బెదిరింపులు.. అరెస్టులు.. కిడ్నాపులు
నంద్యాలలో సీపీఐ నేత కిడ్నాప్‌కు యత్నం
రుద్రవరం సీపీఐ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భాస్కర్
రాత్రి 11 గంటలకు నంద్యాల సీపీఐ ఆఫీసుకు కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాజారావు
ఎస్సై పిలుస్తున్నాడని బయటకు పిలిచి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన రాజారావు, కానిస్టేబుల్ ఓబులేశు
తిరగబడిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, కార్యకర్తలు.. డయల్ 100కు ఫోన్ చేసిన సీపీఐ నేతలు
— greatandhra (@greatandhranews) October 27, 2026

ఈ వార్త మన ఆర్కే కు తెలుసోలేదో! పాపం! ఇప్పుడు తిడితే ముందుముందు ఏమవుద్దో అని కంగారు. తిట్టకపోతే క్యాడర్ తిడుతుంది అనుమానం. కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు నాయకులకు, ఇంకో రెండు తోక పార్టీ నాయకులకు కూడా ఇదే సందేహం. బిక్కచచ్చి ఉంటున్నారు.