టీడీపీపై వ్య‌తిరేక‌త … జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కాలంటే?

ఇప్పుడిప్పుడే టీడీపీపై వ్య‌తిరేక‌త‌, అలాగే కూట‌మి పార్టీల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా వైసీపీకి మంచిరోజులు క‌నిపిస్తున్నాయి.

కూట‌మి ప్ర‌భుత్వానికి ఆయుష్షు త‌గ్గుతోంది. స‌గం పాల‌న పూర్తి చేసుకోడానికి ఇంకెన్నో రోజులు లేవు. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వుంద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది.

తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా టీడీపీ అత్యంత జుగుప్సాక‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో జాతీయ స్థాయిలో కూడా బ‌ద్నాం అయ్యింది. ఇంత వ‌ర‌కూ చంద్ర‌బాబు అంటే ఒక ప్ర‌జాస్వామిక వాది అనే గుర్తింపు, గౌర‌వం వుండేది.

అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల్ని క‌నీసం నామినేష‌న్లు కూడా వేయ‌నివ్వ‌కుండా అడ్డుకోవ‌డంతో చంద్ర‌బాబును గ‌ల్లీ మొద‌లు ఢిల్లీ వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. రాజ‌కీయ చ‌ర‌మాంకంలో చంద్ర‌బాబుకు ఇది తీవ్ర మ‌చ్చ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కాలం మంత్రులు, ఎమ్మెల్యేల‌పై నెగెటివ్ ఉంద‌నే మాట వినిపించేది. ఇప్పుడు టీడీపీపైనే తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్య‌మా అని టీడీపీ సాధించిన ఘ‌న‌త ఇది.

టీడీపీపై వ్య‌తిరేక‌త‌… అంతిమంగా వైసీపీకి రాజ‌కీయ అనుకూల‌త‌గా మారాలి. ఆ ప‌రిస్థితి వుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ పాల‌న‌లో ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను చూశాం. అయితే ఆ అరాచ‌క హ‌ద్దుల్ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ అధిగ‌మించింది. త‌మ‌కెవ‌రూ సాటి రార‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు నిరూపించుకున్నారు. దీంతో వైసీపీకి ఈ ప‌రిణామాల‌న్నీ సానుకూల‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక్క‌డే వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఆలోచించాలి. గ‌తంలో తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొన్న త‌న పార్టీ నేత‌లు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తిరిగి టికెట్లు ఇవ్వ‌డంపై జ‌గ‌న్ పున‌రాలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. చాలా చోట్ల వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల్ని మార్చాల‌ని పార్టీ కేడ‌ర్ కోరుతోంది.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌ను ప‌ట్టించుకోకుండా, సొంత సంపాద‌న‌కే ప‌రిమితం అయ్యార‌న్న ఆరోప‌ణ‌లు ఎక్కువ మంది ఇన్‌చార్జ్‌ల‌పై ఉన్నాయి.

అలాంటి వారిలో ఇప్ప‌టికీ నియోజ‌క వ‌ర్గ బాధ్య‌త‌ల్లో ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు, పార్టీ కేడ‌ర్‌కు దూర‌మైన ఇన్‌చార్జ్‌ల‌ను మార్చాల్సిన అవ‌స‌రం, బాధ్య‌త జ‌గ‌న్‌పై ఉన్నాయి.

త‌న‌తో వ్య‌క్తిగ‌తంగా బాగుంటార‌నో, ఇంకో కార‌ణంతో పాత వాళ్ల‌కే మ‌ళ్లీ టికెట్లు ఇవ్వాల‌నే ఆలోచ‌నలో జ‌గ‌న్ చేస్తే మాత్రం, టీడీపీపై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకునే ప‌రిస్థితి ఎంత మాత్రం వుండ‌దు. దొందు దొందే అని ప్ర‌జ‌లు అనుకునే ప్ర‌మాదం వుంది.

రాజ‌కీయ రంగంలో ఉన్నంత మంది న‌టులు, బుల్లితెర‌, వెండితెర‌పై కూడా క‌నిపించ‌రు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థుల ప‌నితీరుపై జ‌గ‌న్ లోతుగా ప‌రిశీలిస్తే, అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. అలాంటి వాళ్ల‌కు చెక్ పెట్టేందుకు ఇంత‌కంటే మంచి స‌మ‌యం మ‌రొక‌టి లేదు.

టీడీపీపై లేదా చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త‌తో గెలిచేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ అనుకుంటే, ప‌ప్పులో కాలేసిన‌ట్టే. త‌న‌తో పాటు పార్టీపై సానుకూల‌త‌తో అధికారంలోకి రావ‌డం మంచిద‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. ఆ దిశ‌గా ప్ర‌జ‌ల్లో సానుకూల‌త రావాలంటే, త‌న పార్టీ అభ్య‌ర్థులుగా మంచి వారిని బ‌రిలో నిలిపాల్సి వుంటుంది.

ఇప్పుడిప్పుడే టీడీపీపై వ్య‌తిరేక‌త‌, అలాగే కూట‌మి పార్టీల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా వైసీపీకి మంచిరోజులు క‌నిపిస్తున్నాయి. తెలివైన రాజ‌కీయ నాయ‌కులు సొమ్ము చేసుకుంటారు.

అందుకే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌పై ఇప్ప‌టి నుంచే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించాలి. మొహ‌మాటానికి వెళ్ల‌కుండా, వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టాలి.

గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి సంస్క‌ర‌ణ‌లు చేప‌డితేనే భ‌విష్య‌త్‌లో వైసీపీకి అధికారం ద‌క్కే అవ‌కాశాలుంటాయి.

వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న వారిని దూరం పెట్టకుండా, మ‌ళ్లీ వారినే ప్ర‌జ‌ల‌పై రుద్దితే వైసీపీ చేజేతులా అధికారానికి దూరం అవుతుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు. ఏం చేసుకోవాల‌నేది జ‌గ‌న్ చేతుల్లోనే వుంది. ఇక ఆయ‌న ఇష్టం.

18 Replies to “టీడీపీపై వ్య‌తిరేక‌త … జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కాలంటే?”

  1. Powerful సీఎంలు, మాజీ PM లు, అంబానీ, టాటా బిర్లాలకి కూడా బెంగళూరులో 23 ఎకరాల ప్యాలెస్ లేదు.. కానీ మావోడు మెజెస్టిక్ బస్టాండ్లో రిచ్చా తొక్కి, మూటలు మోసి కేవలం 5యేళ్ళలో “8000కోట్ల విలువైన 23ఎకరాల ప్యాలెస్ సంపాదించి.. తన సొమ్మే అత్తకి దానం చేశాడట.. 

    ఈ సంపాదన సీక్రెట్ మాకు కూడా చెప్పొచ్చు కదా జగేనా?

  2. మన “తేడాసింహం” తన సొంత అడ్డా పులివెందులలో 

    “మగ సింహం”తో చీకట్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని “ప్యాలెస్ పెళ్ళానికి” రిపోర్ట్ వచ్చింది..

    అందుకే రాష్ట్రం లో ఎక్కడాలేని విధంగా కడప జిల్లాలో 85% ఛైర్మెన్ లు ఏకగ్రీవం అయ్యాయి

    ఇంతకీ మన “మాడా సింహాన్ని” లైన్లో పెట్టిన

     మగసింహం ఎవరూ?

  3. క్షేత్రస్థాయిలో ప్రజలు టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.. ఇదే మాంచి సమయం మించిన దొరకదు.. మనం ఆ11 స్థనాలలో రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే, నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాడట చంద్రబాబు.

    So కమాన్ సింగిలూ .. సింహం లెక్క నువ్వు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ కి పోయి ఆ నలుగురినీ ఊ చ్చ పోయిస్తుంటే చూడాలని ఉంది.. మరి ఏమంటావ్?

  4. వ్యతిరేకత…ప్రచారం…వారెవ్వా…పాపం నువ్వు ఎంత లేపాలని చూసినా మీ 11 రెడ్డికి అర్థం కావడం లేదు…నువ్వు తీసుకున్న paytm అమౌంట్ లో న్యాయం చేస్తున్నావ్…కానీ వాళ్ళే పట్టించుకోవడం లేదుగా

  5. అమరావతి పోలవరం వెలిగొండ ఫేజ్2..ఇంకా చిన్న మధ్య తరహా తాగు సాగునీటి ప్రాజెక్టులు పది లోపున్నై.. ఇవి ఖచ్చితం గా పూర్తి అవుతాయి.వై to vote ఫర్ j?సెంటర్ లో ఏ కూటమి వైపు j??

  6. అయిదు రూపాయలు కోసం ఏది పడితే అది రాయమాకా .. సాక్షి లాగ నువ్వు కూడా టాయిలెట్ లో టిష్యూ పేపర్ లాగ అయిపోతావు . ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కామన్ కానీ జనాలలో జగన్ అనే మాట కలలో వినపడితేనే దడుసుకొని నిద్ర లెగుస్తున్నారు .. అంతలా భయపెట్టారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో .. ఆ భయమే టీడీపీ కి శ్రీరామా రక్షా .!

  7. ఈ సుద్దులన్నీ నెం.2 కి చెప్పి ఏం లాభం? నిర్ణయాలు తీసుకునే నెం.1 కి కదా చెప్పాలి?!

  8. ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు ఏనాడైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని రాశారా జీఏ.ప్రభుత్వం మనది కాదు కాబట్టి రెండున్నర సంవత్సరాల్లోనే వ్యతిరేకత వచ్చేసింది అని రాస్తున్న జీఏ.

  9. aaha G @ ki “ఇంతవరకు సి బి న్ అంటే ప్రజాస్వామ్య వాది అని గుర్తింపు ఉండేది” ippatikaina nijam oppukunnav mari idhi gathamlo eppudu cheppalede?

  10. చంద్రబాబు ప్రజాస్వామ్యవాది అనే గుర్తింపు, గౌరవం ఉండేవని నువ్వే అంటున్నావు కదా. అంటే స్వతహాగా చంద్రబాబు మంచోడే. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావాలి కదా నీకు.

    ఎందుకంటే, ఊళ్లలో ప్రజలు కూడా టీడీపీ చేసేది తప్పే అయినా, జగన్ అప్పట్లో అలా చేయబట్టే కదా ఇప్పుడు వీళ్లు ఇలా చేస్తున్నారు అనే నిర్ణయానికి వచ్చేశారు. అంటే, 2019–24 మధ్యలో జగన్ చేసిన అరాచకాల ఫలితమే ఈ గొడవలు.

    నిజానికి కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగిన మాట వాస్తవమే. కానీ అసలు మొదలుపెట్టింది పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబమే. వాళ్లు మొదటి రోజే అరాచకం చేయాలని చూసి దెబ్బ తిన్నారు. అప్పుడుగానీ టీడీపీ వాళ్లకు అర్థం కాలేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా రెచ్చిపోవాలని చూస్తుంటే, మరి అధికారంలో ఉన్నవాడు ఏం చేయాలో అదే చేశాడు.

    నిజానికి చాలా చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోయినా, నామినేషన్ల పేరుతో గొడవలు చేసింది వైసీపీ.

    సరే, అయ్యిందేదో అయిపోయింది. కానీ 2029లో మాత్రం అధికారం వైసీపీకి రాదమ్మా. 2034లో అవకాశం ఉంటుంది, కానీ అప్పటికి జగన్ బయట ఉంటేనే. ఎందుకంటే రాష్ట్రంలో అయితే టీడీపీ, లేదంటే వైసీపీ. కాబట్టి 2034లో అయినా అవకాశం ఉంటుంది. లేకపోతే, జగన్ చేసిన ఛండాలాలకు జీవితంలో అధికారం అనే ఆశ వదులుకోవాల్సిందే.

Comments are closed.