నటీనటులు వాళ్లను తమ పేర్లతో కంటే, టైటిల్స్ తో పిలిస్తేనే ఎక్కువ సంతోషిస్తారు. పవర్ స్టార్, సూపర్ స్టార్, ఐకాన్ స్టార్ అనే పేర్లతో సంభోదిస్తే ఎక్కువ ఆనందపడతారు. ఎప్పటికప్పుడు తమ బిరుదుల్ని మార్చుకునే హీరోలు కూడా ఉన్నారు. అయితే నయనతార మాత్రం ఇలాంటి బిరుదులు వద్దంటోంది.
నయనతారను అంతా ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తుంటారు. అయితే ఇకపై తనను అలా పిలవొద్దని కోరుతోంది నయనతార. ఈ మేరకు ఆమె ఏకంగా ప్రకటన కూడా విడుదల చేసింది.
“నన్ను చాలామంది అభిమానంతో లేడీ సూపర్ స్టార్ అనిపిస్తుంటారు. మీ అందరి ప్రేమాభిమానాల నుంచి ఆ టైటిల్ పుట్టుకొచ్చిందనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఇకపై అంతా నన్ను నయనతార అని మాత్రమే పిలవాలని కోరుకుంటున్నాను. నా మనసుకు దగ్గరైన పేరు నయనతార మాత్రమే.”
నయనతార అని పిలిస్తే తనకు ఇష్టమని, ఓ నటిగానే కాకుండా, ఓ వ్యక్తిగా అలా పిలిపించుకోవడమే తనకు ఇష్టమని స్పష్టం చేసింది ఈ హీరోయిన్. టైటిల్స్ గొప్పగానే ఉంటాయని, కానీ అవి తీసుకొచ్చే ఇమేజ్ వల్ల కొన్నిసార్లు చేసే పనికి, ఇష్టమైన వ్యక్తులకు దూరమైపోతుంటామని అంటోంది.
Last line అదిరింది
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Good mam