ఏపీలో అన‌ధికార ఎమ‌ర్జెన్సీ!

పాల‌కుల ప‌గ‌, ప్ర‌తీకారాల్ని తీర్చుకోడానికి 1975 నాటి ఎమ‌ర్జెన్సీని పున‌రావృతం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌నే విమ‌ర్శ బ‌ల‌ప‌డుతోంది.

1975లో నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమ‌ర్జెన్సీ గురించి సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు క‌థ‌లుక‌థ‌లుగా చెప్తుంటారు. అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా మాట్లాడేవాళ్లంద‌రినీ జైల్లో వేశారు. కొంద‌రు నెల‌లు, ఏడాదికి పైగా జైలు జీవితాన్ని ఇందిరాగాంధీ పుణ్య‌మా అని గ‌డిపిన నాయ‌కులున్నారు. ఇందిరాగాంధీ రాజ‌కీయ జీవితంలో ఎమ‌ర్జెన్సీ అనేది మ‌చ్చ‌గా మిగిలింది.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ నాయ‌కులు, అలాగే ఐపీఎస్ అధికారుల‌పై కేసులు, అరెస్ట్‌లు కూడా నాటి ఎమ‌ర్జెన్సీ రోజుల్ని గుర్తు తెస్తున్నాయ‌ని సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో అన‌ధికార ఎమ‌ర్జెన్సీ ఓ మ‌చ్చ‌గా మిగిలిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ రాయ‌డం, దాని అమ‌లు కోస‌మే అన్న‌ట్టుగా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాగుతున్న అరెస్ట్ ప‌ర్వాలు, అలాగే కేసుల‌తో వేధించ‌డాలు, ప్ర‌త్య‌ర్థుల ఆస్తుల విధ్వంసాలు, భౌతిక‌దాడులు ఎమర్జెన్సీని త‌ల‌పిస్తోంద‌న్న అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయ‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

పోనీ, వీళ్లేమైనా స‌క్ర‌మ పాల‌న సాగిస్తున్నారా? అంటే… అలాంటిదేమీ లేద‌న్న అభిప్రాయం జ‌నం నుంచి వ‌స్తోంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీ, దౌర్జ‌న్యాలు, అవినీతి వ్య‌వ‌హారాలు గ‌మ‌నిస్తే… పోయిన పాల‌కులే కొంచెం న‌యం అనే దుస్థితి ఏర్ప‌డింద‌నే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆదాయం చూసుకునేవాళ్లు. ఇప్పుడు ఎక్క‌డైనా వెంచ‌ర్ వేయాలంటే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి, అలాగే కూట‌మి నేత‌ల అనుమ‌తులు తీసుకోవాల్సిన ప‌రిస్థితి. అందుకే వ్యాపారం ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయింది.

కూట‌మి నేత‌ల అనుమ‌తి లేనిదే పోలీసులు కేసు పెట్టే ప‌రిస్థితి లేదు. నేరాల్ని బ‌ట్టి కాకుండా, అధికార పార్టీ వాళ్లైతే ఒక న్యాయం, కాక‌పోతే మ‌రో న్యాయం. ఇదీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ముఖ చిత్రం. కూట‌మి నేత‌లు నేరాల‌కు పాల్ప‌డినా, అధికార అండ‌తో కేసులు లేకుండా చేసుకుంటున్నారు. అదే ప్ర‌తిప‌క్ష‌మైతే చాలు… అధికార ప‌క్షానికి అడ్డంకి అనుకుంటే, వెంట‌నే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నార‌నే విమ‌ర్శ‌ను కొట్టి పారేయ‌లేని ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో. ఇలాగైతే రాష్ట్రం ఏమ‌వుతుందో అనే ఆందోళ‌న త‌ట‌స్థుల్లో ఉంది.

పాల‌కుల ప‌గ‌, ప్ర‌తీకారాల్ని తీర్చుకోడానికి 1975 నాటి ఎమ‌ర్జెన్సీని పున‌రావృతం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌నే విమ‌ర్శ బ‌ల‌ప‌డుతోంది. ఇది చంద్ర‌బాబుకు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే మంచి విష‌యాల్ని చెవికెక్కించుకునే ప‌రిస్థితి ఎక్క‌డుంది?

22 Replies to “ఏపీలో అన‌ధికార ఎమ‌ర్జెన్సీ!”

  1. 2029 లో జగన్ రెడ్డి వస్తే.. ఇంతకు పదింతలు ఇచ్చేస్తాను అంటున్నాడు కదా..

    అందుకే.. జనాలు కూడా ఇదే బెటర్ అనుకుని.. జగన్ రెడ్డి ని శాశ్వతం గా పక్కన పెట్టేసారు.. అనే అభిప్రాయం జనం నుండి వస్తోంది..

    ..

    గత ఐదేళ్లు మన జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం తో రెచ్చిపోయినప్పుడు.. మన రాతలు కూడా రెచ్చిపోయేవి..

    చెడుగుడు ఆడేసుకొన్నాడు .. కౌంటర్లతో చెలరేగాడు.. హబ్బో.. మన ఉత్సాహం ఒక రేంజ్ లో ఉండేదిలే..

    ..

    జగన్ రెడ్డి కి అధికారం పోతుందనీ.. అదీ 11 సీట్లతో ముష్టినాకొడుకుగా మిగులుతాడని ఊహించలేకపోయావు..

    ఇప్పుడు.. మీ మందే మీకు మింగిస్తుంటే.. లబో దిబో అని ఏడుస్తున్నావు..

    ..

    నీ ముష్టి శాపనార్ధాలకు సింతకాయలు కూడా రాలవు గాని..

    భరించలేకపోతే.. ఉరేసుకో.. బతకాలని ఉంటె .. రాష్ట్రం వదిలి పారిపో..

  2. ఒక ఎంపీ ని అయిదు ఏళ్ళు నియోజకవర్గం వెళ్లనివ్వనప్పుడు గుర్తుకు రాలేదా ఎమర్జెన్సీ?

  3. రాజధాని రైతులు నాలుగు ఏళ్ళ నిరసన తెలియజేస్తే, ఆడవాళ్ళ కడుపులో కాళ్ళతో తొక్కినప్పుడు, పెట్రోల్ బాంబులు వేసినప్పుడు గుర్తుకురాలేదా ఎమర్జెన్సీ?

  4. జనాలు రోడ్ల మీదకి వొచ్చి నిరసన చెప్పారా లేక నీ చెవి లో చెప్పారా వెంకట్రావు ..

  5. ఉద్యోగులు టీచర్లు నిరసన తెలియజేయకుండా క్లాస్రూమ్, కార్యాలయాలలో లో పోలీస్ గస్తి పెట్టినప్పుడు గుర్తులేదా ఎమర్జెన్సీ?

  6. ప్రతిపక్ష నేత ఇంటి మీదికే మారణాయుధాలతో దాడి చేసినప్పుడు గుర్తులేదా ఎమర్జెన్సీ?

  7. మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు చేసింది కూడా ఇదే కదరా… వాళ్ళు బలుపు దిగాలా ఇప్పుడు..రేపు వీళ్లది కూడా…

  8. మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు చేసింది కూడా ఇదే కదరా… వాళ్ళు బ లు పు దిgaలా ఇప్పుడు..రేపువై వీళ్లది కూడా…

  9. మహా మేత అప్పట్లో ఇందిరా రాజ్యం తెస్తాను అనే కదా పాద యాత్ర చేసి గెలిచాడు అంటే ఇందిరా రాజ్యం బానే ఉంది , నీకే కుళ్ళు!

    1. చంబాగారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మోచేతినీళ్ళు త్రాగిన వాడే కదా సార్! ఈ మధ్య కూడా వారితో భాగస్వామ్యం కలిగి వున్నాడు, మోదీగారి శరణువేడుకోకముందు. అలాగయినా ఇందిరా రాజ్యం తీసుకువొచ్చారేమో

      1. నేను చెప్పేది , మహా మేత చెప్పింది కూడా అదే ఇందిరమ్మ రాజ్యం బానే ఉంది నువ్వు కూడా అదే అంటున్నావు ,GA గాడికి కుళ్ళు…

  10. నువ్వెందిరా బాబు! ప్రభుత్వం మారినా ఇంకా గత ప్రభుత్వ అరాచకాల గురించె రాస్తావు!

    1. జగన్ అన్న రాజ్జాంగం గురించి ఎప్పుడన్నా రాశవా గురువిందా?

      RRR Custodial torture…

      Dr. Sudhakar

      Acchem Naidu arrest

      Dulipala Narendra arrest

      Kuna Ravi arrest

      JC brothers arrest

      ABN, EENADU

      Margadarsi Chits

      Amar raja Batteries

      Amaravati Farmers

      Ranaganayakamma (Faceb00k post)

      Babai Muder Case

      Chandrababu Naidu arrest

      List goes on…

  11. మైనారిటీ తీరని పవన్ కూతురు గురించి, పవన్ అమ్మ నా బూతులు తిట్టడం, ఇవన్నీ నిజానికి గత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఈ పాటికే బొక్కలో వెయ్యాల్సింది. చేయించిందే వాళ్ళు కాబట్టి ఆలస్యం అయ్యింది. ఇందులో రాజకీయం లేదు, ఎమర్జెన్సీ లేదు.

    ఎమర్జెన్సీ అంటే ఈ పాటికి నిన్ను కూడా మూసేయడం. ఆలా జరగలేదు కదా, ఇంకా విషం చిమ్మ గలుగుతున్నావ్ కదా?

  12. వైస్ ఫామిలీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ సీబీన్ ఇచ్చారు కానీ పేరు రాలేదు , ఉద్యోగాలు అత్యధికంగా టీడిపి పాలనలోనే వచ్చాయి అయినా పేరు రాదు ,

    పదే పదే పన్నులు వేయని ,ధరలు చార్జిలు కంట్రోల్ లో ఉంచే పాలకుడు చంద్రబాబు అయినా ఆయనకు పేరు రాదు.కానీ నువ్వు నీ పో రం బో కు సైట్ లో మాత్రం ఎమర్జెన్సీ అని రాస్తావు … విధ్వంసం చేసి పెట్టారు కదరా అబ్బా కొడుకులు గత పాలనలో .

Comments are closed.