శర్వానంద్ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ‘భోగి’. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రిలీజై, ఇవాళ్టికి వారం రోజులయ్యేది. కానీ అనుకున్నట్టు జరగలేదు. మరీ ముఖ్యంగా సెన్సార్ ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
అలా నవంబర్ 12 తేదీని మిస్సయిన భోగి సినిమాకు ఇప్పుడు మరో విడుదల తేదీ ప్రకటించారు. నవంబర్ 27న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
సెన్సార్ సమస్యల వల్ల అనుకున్న టైమ్ కు సినిమా విడుదల కాలేదు. దీంతో సెన్సార్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. అక్కడ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. దీంతో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
డిసెంబర్ తో పాటు, సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు క్యూ కట్టిన నేపథ్యంలో, భోగి సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో మాస్ లుక్ తో పాటు, యాక్షన్ మేకోవర్ లో కనిపించబోతున్నాడు శర్వానంద్.
1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె. కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.
