పుష్ప 2 ప్రచారం ఆది నుంచి ఇప్పటి వరకు వన్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ బన్నీ. ఏ వేదిక మీదైనా నో సింగిల్ ఛైర్. నిర్మాతలు రావడం, మాట్లాడడం, వెళ్లడం. తరువాత హీరో రావడం, మాట్లాడడం, వెళ్లడం. అంతే. అంతకు మించి లేదు. అది ఏ రాష్ట్రమైనా, అక్కడితో అనుబంధాన్ని బన్నీ వివరించడం మాత్రమే. పుష్ప 2 ఫంక్షన్లు అన్నీ రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా జరిగాయి. సింగిల్ ఇంటర్వ్యూ లేకుండా సినిమా పబ్లిసిటీ మెయింటైన్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో బన్నీ. కనీసం బాలీవుడ్ సెలబ్రిటీలతోనో, టాలీవుడ్ సెలబ్రిటీలతోనో ఓ ఇంటర్వ్యూ అయినా చేయించి కామన్‌గా వదులుతారు. అది కూడా లేదు.
ఒక్క వేదిక మీదైనా క్యూ అండ్ ఏ నిర్వహించకుండా పబ్లిసిటీ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో అండ్ మూవీ పుష్ప 2. ఏ ఒక్క పబ్లిసిటీ ఫంక్షన్‌లో కూడా బన్నీ మినహా మరే ఒక్క నటుడు పాల్గొనని విధంగా ప్రచారం చేసిన సినిమా ఇది. సినిమాలో చేసిన ఏ ఒక్క నటుడిని ఇప్పటివరకు సినిమా ఫంక్షన్‌కు పిలవలేదు. ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్‌కు కూడా దర్శకుడు సుకుమార్ వెళ్లలేదు.
మొత్తం పుష్ప 2 సినిమా ప్రచారం మొత్తం కేవలం బన్నీ చుట్టూ తిరిగింది. బన్నీ కూడా తన మాట, నడక, నవ్వు అంతా మార్చుకున్నారు. పుష్ప 2 ఫంక్షన్లు అన్నీ చూస్తే బన్నీ నడక తీరు చిత్రంగా ఉంటుంది. ఓ కల్నల్, ఓ మేజర్‌ల మాదిరిగా స్టిఫ్‌గా, చాలా నెమ్మదిగా నడవడం కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ గతంలో లేదు. స్టేజ్ మీదకు తాను వెళ్లడం, నిల్చోడం, మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా, డిఫరెంట్‌గా కనిపిస్తుంది.
గమ్మత్తేమిటంటే నిన్నటికి నిన్న బన్నీని పలకరించడానికి టాలీవుడ్ మొత్తం తరలి వెళ్లింది. అక్కడ మాత్రం బన్నీ బాడీ లాంగ్వేజ్ ఇలా లేదు. రెగ్యులర్‌గా, మామూలుగానే ఉంది. నిన్న, మొన్న రెండు రోజులు మొత్తం మీడియా బన్నీ చుట్టూ తిరిగింది. ఈ రోజు మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అంటే మరో పూట కూడా బన్నీ చుట్టూనే తిరుగుతుంది.
మొత్తం మీద ఇప్పుడు అంతా బన్నీ వన్ మ్యాన్ షో. అది పుష్ప 2 ప్రమోషన్ అయినా, టాలీవుడ్ వార్తల్లో అయినా.
A1లెవెన్ గాడు “సంధ్యలో రేవతి”ని లేపేసి “తన మార్క్ శవ రాజకీయం” స్టార్ట్ చేసిన తర్వాత కానీ, A1 గాడి కుట్ర బన్నీకి తెలిసిరాలేదు, తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యి బొమ్మ కనపడింది.
One man dhi n……..k di
yandhi reddy
jagan anna body language mottham election taravatha maripoye
juttu ki tella ventrukalu kooda vacce
నీవేదో అనాలిసి రాస్తావ్..కానీ sjk లు దానిని హుసా చింపుకుని నిన్ని ఏటకారాలు చేస్తూ జగన్ వి లాక్కుంటూ మురిసి పోతుంటారు….
BHAJANA
ఒక్కరోజు చనిపోయిన వ్యక్తి గురించి రాయలేదు గ్రేట్ ఆంధ్రా వాళ్ళు
ఒక్కరోజు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడలేదు ఈ గ్రేట్ ఆంధ్ర వాడు