Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ అవసరమా?

ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ అవసరమా?

బీజేపీ-జనసేన పొత్తు నడుస్తోంది. కృష్ణంరాజు బీజేపీ. కాబట్టి రేపు ప్రభాస్ సినిమా రిలీజైతే పవన్ ఫ్యాన్స్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పవన్ అభిమానులు కొందరు చెబుతున్నారు. రాజకీయంగా బీజేపీకి పవన్ కలిసిరావడంతో పాటు.. సినిమాల పరంగా ప్రభాస్ కు కూడా పవన్ హెల్ప్ అవుతాడని కాకిలెక్కలు చెబుతున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ అవసరమా అనేది ఇక్కడ చర్చనీయాంశం.

బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అతడికి ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్లో అభిమానులున్నారు. చివరికి సాహో లాంటి సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా, ఉత్తరాదిన సూపర్ హిట్టయిందంటే.. ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి హీరోను పట్టుకొని, పవన్ ఫ్యాన్స్ మద్దతిస్తామనడం కామెడీగా ఉంది.

ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ మద్దతిస్తే తప్పులేదు. అతడి సినిమాలకు మరింత మైలేజీ. ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. కానీ తమ హీరో మద్దతు లేకపోతే ప్రభాస్ సినిమాలు ఆడవు అనేంతలా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. స్వయంగా కృష్ణంరాజు సొంత ప్రాంతం భీమవరంలో క్షేత్రస్థాయిలో పవన్-ప్రభాస్ అభిమానుల మధ్య జరుగుతున్న వాగ్వాదం ఇది.

పవన్ ఫ్యాన్స్ ను ఆయన కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జునే పట్టించుకోవడం మానేశాడు. "చెప్పను బ్రదర్" అంటూనే తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ అండ లేకుండానే "అల వైకుంఠపురములో" లాంటి పెద్ద హిట్ కొట్టాడు. అలాంటిది ప్రభాస్ కు మద్దతిస్తాం, తీసుకోండంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

నిజానికి ప్రభాస్ వివాదాస్పద వ్యక్తి కాదు. వివాదాలకు పూర్తిగా దూరం. నిజంగా పవన్ ఫ్యాన్స్ మద్దతిస్తామంటే "థ్యాంక్స్ డార్లింగ్స్" అంటాడే తప్ప, "వద్దు బ్రదర్" అనడు. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరు హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ ను లైక్ చేస్తారు. అతడి వ్యక్తిత్వం అలాంటిది.

సో.. బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభాస్ సినిమాల్ని సూపర్ హిట్ చేసేస్తామంటూ.. పవన్ ఫ్యాన్స్ క్షేత్రస్థాయిలో చేస్తున్న హంగామాను కాస్త తగ్గిస్తే మంచిది.

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?