చెప్పను బ్రదర్.. పరోక్షంగా చెప్పేసిన పవన్

బన్నీకి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. పవన్ మాత్రం ఆ ఉద్దేశంతో చెప్పలేదు

చెప్పను బ్రదర్.. కొన్నేళ్ల కిందట అల్లు అర్జున్ నిండు సభలో చెప్పిన డైలాగ్ ఇది. పవన్ కల్యాణ్ పై స్పందించమని అడిగినప్పుడు తన అసహనాన్ని ఈ డైలాగ్ ద్వారా ఆయన వ్యక్తం చేశాడు. అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఎన్నోసార్లు భగ్గుమంది.

ఏళ్లు గడిచాయి, వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ టైమ్ వచ్చింది. చెప్పను బ్రదర్ అంటూ నేరుగా చెప్పకపోయినా, బన్నీ గురించి మాట్లాడనంటూ నేరుగానే మీడియా ముఖంగా చెప్పేశారు పవన్ కల్యాణ్. దీంతో అల్లు అర్జున్ కు ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు అతడి ఫ్యాన్స్.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఒక రాత్రి జైళ్లో పెట్టారు. మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్… ఆ వెంటనే తన మామ చిరంజీవిని కలిశాడు. అట్నుంచి అటు నేరుగా వెళ్లి నాగబాబును కూడా కౌగలించుకున్నాడు.

అలా మెగా కుటుంబానికి, తనకు మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. నాగబాబును కలిసిన తర్వాత చాలామంది, అదే ఊపులో పవన్ ను కూడా కలుస్తాడని అనుకున్నారు. బన్నీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పైగా ఘటన జరిగి ఇన్ని రోజులైనా దీనిపై స్పందించనూ లేదు.

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ ను ఈ అంశంపై ప్రశ్నించింది మీడియా. బన్నీ అరెస్ట్ పై స్పందించడానికి పవన్ నిరాకరించారు.అంతకంటే పెద్ద సమస్యలున్నాయని, కొంచెం పెద్దగా ఆలోచించాలని మీడియాకు సూచించారు. అంటే, పవన్ కల్యాణ్ దృష్టిలో బన్నీ ఇష్యూ చాలా చిన్నదన్నమాట.

ఈ సందర్భంగా మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. దయచేసి సినిమాలు, సినిమాల ఇష్యూస్ గురించి అడగొద్దని.. సినిమాను దాటి ఆలోచించాలని, కాస్త పెద్దగా ఆలోచించి, పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ ఒక్క స్టేట్ మెంట్ తో బన్నీ గురించి “చెప్పను బ్రదర్” అంటూ పవన్ పరోక్షంగా చెప్పినట్టయింది.

పవన్ మాట్లాడిన ఈ చిన్న వీడియో బిట్ ను ఆయన అభిమానులు సోషల్ మీడియా అంతటా వైరల్ చేసి పడేస్తున్నారు. బన్నీకి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. పవన్ మాత్రం ఆ ఉద్దేశంతో చెప్పలేదు, ఫ్యాన్స్ మాత్రం ఒకే ఉద్దేశంతో వైరల్ చేస్తున్నారు.

27 Replies to “చెప్పను బ్రదర్.. పరోక్షంగా చెప్పేసిన పవన్”

  1. మీడియా కి సిగ్గుండాలి అసంబద్దమైన సమయంలో ఇలాంటి స్పందనలు అడిగేదానికి

  2. అన్ని పెద్ద విషయాలు మాట్లాడే మన పావలా కుక్క కి చిన్న పిల్లల మన ప్రాణాలే పోతే ఒచ్చి ధైర్యం చెప్పి న్యాయం జరిగేలా చూస్తాం అని మాట ఇచ్చే ధైర్యం లేదు.. ఇక్కడ మైలేజ్ ఉందని గేట్ కాడ కుక్క ల ఒచ్చి మొరుగుతున్నాడు .. వదిలేయకండి అలా వాడ్ని.. గాడిద ల తిరుగుతున్నాడు

  3. పవన్ కడపలో ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి గురించి మాట్లాడుతుంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడమంటే ఇది సమయం కాదు అన్నాడు. దాన్లో తప్పేముంది? అసలు మీ మీడియా వాళ్ళకి కూడా అల్లు గురించి తప్ప ఇంకే టాపిక్ దొరకదా?

Comments are closed.