క్రిస్మస్ బరిలోకి దిగుదాం అనుకున్నాయి రాబిన్ హుడ్, సారంగపాణి జాతకం. రెండూ కొంత మేరకు ప్రచారం నిర్వహించాయి. టీజర్లు వదిలాయి. మీడియా మీట్ లు జరిపాయి. పాటలు వదిలాయి. కానీ లాస్ట్ మినిట్ లో బరిలోంచి పక్కకు తప్పుకున్నాయి.
నిజానికి అలా తప్పుకోవడమే మంచిదే అయింది. బచ్చలమల్లి సినిమాకు ఎంత ప్రచారం చేసినా ఓపెనింగ్ పడలేదు. పుష్ప 2 ఎఫెక్ట్ ఏ మేరకు వుందో అప్పుడు అర్థం అయింది. ఈ సినిమాలు వచ్చి వుంటే వాటి పరిస్థితి అలాగే వుండేది.
ఇప్పుడు సందడి అంతా సంక్రాంతి సినిమాలదే. రాబిన్ హుడ్, సారంగపాణి జాతకం సినిమాలకు డేట్ లు ఎప్పుడు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. రాబిన్ హుడ్ శివరాత్రికి అని టాక్ వుంది. కానీ తమ్ముడు సినిమా కూడా శివరాత్రికే అని టాక్ వుంది. ఈ రెండింటిలో ఒకటి డిసైడ్ కావాల్సి వుంటుంది. అలాగే సారంగపాణి జాతకం జనవరి మూడో వారమా? నాలుగో వారమా అన్నది తేల్చుకోవాలి.
డేట్ లు ముందు డిసైడ్ అయితే అప్పుడు మళ్లీ పబ్లిసిటీ మొదటి నుంచీ మొదలుపెట్టాలి. కొత్త టీజర్లు, కంటెంట్ వదలాలి. జనాలకు మళ్లీ ఈ సినిమాలను మరోసారి పరిచయం చేయాలి. ఇదంతా కాస్త ఇబ్బందికర, కష్టమైన వ్యవహారమే. అదీ కాక సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా మూడు నాలుగు వారాలు లాగేస్తుంది. అప్పుడు డేట్ డిసైడ్ చేయడం కూడా కష్టమే.
డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తే ఈ సమస్య ఉండదు