అప్పుడు నిధి కూడా అలానే చెప్పింది

ఇప్పుడు ప్రియాంక మోహన్ వంతు. ఈమె ఓజీ అప్ డేట్ ఇచ్చింది.

“హరిహర వీరమల్లు పార్ట్-1 షూటింగ్ కంప్లీట్ అయింది. 2-3 రోజులు వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది.” సరిగ్గా 2 నెలల కిందట నిధి అగర్వాల్ ఇచ్చిన స్టేట్ మెంట్ అది. కట్ చేస్తే, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.

ఇప్పుడు ప్రియాంక మోహన్ వంతు. ఈమె ఓజీ అప్ డేట్ ఇచ్చింది. “ఓజీ షూటింగ్ పూర్తవ్వడానికి మరికొన్ని రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.” అనేది ఈ హీరోయిన్ మాట.

ప్రియాంక మోహన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన వెంటనే అంతా నిధి అగర్వాల్ ను గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో నిధి ఇలానే చెప్పిందని, ఇప్పుడు ప్రియాంక మోహన్ కూడా అదే టైపు స్టేట్ మెంట్ ఇస్తోందని, సినిమాలు మాత్రం పూర్తవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవంగా చూసుకుంటే వీళ్లిద్దరు చెప్పినవి నిజాలే. ఎటొచ్చి ఈ కొద్ది రోజులు కేటాయించడానికి పవన్ కు టైమ్ లేదు. హరిహర వీరమల్లు సెట్స్ పైకి రాగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర పెట్టుకున్నారు. ఈరోజు కుంభమేళాకు వెళ్లొచ్చారు. రేపట్నుంచి రాజకీయ కార్యక్రమాలు రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనే ఉత్కంఠ పవన్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.

2 Replies to “అప్పుడు నిధి కూడా అలానే చెప్పింది”

Comments are closed.