కుంభ‌మేళా.. ఆ నీళ్ల‌లో స్నానం చేయ‌డానికి ప‌నికిరావు!

కుంభేమేళాలో గంగ‌, యమున సంగమంలో కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి అనేక సంఘ‌ట‌న‌లు కూడా వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాయి. Advertisement కోట్ల మంది స్నానాలు ఆచ‌రించ‌డం, అందుకు ఏర్పాట్లు…

కుంభేమేళాలో గంగ‌, యమున సంగమంలో కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి అనేక సంఘ‌ట‌న‌లు కూడా వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాయి.

కోట్ల మంది స్నానాలు ఆచ‌రించ‌డం, అందుకు ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే.. కుంభమేళాలో స్నానాల‌కు అంటూ ఎగ‌బ‌డ‌టం వ‌ల్ల జ‌రిగిన తొక్కిస‌లాటలో కొంత‌మంది మ‌ర‌ణించ‌డం, కుంభ‌మేళా ప్ర‌యాణికులకు సంబంధించి ఢిల్లీ రైల్వే స్టేష‌న్లో మ‌రో తొక్కిస‌లాట. ఈ ఘ‌ట‌న‌ల‌కు తోడు.. ఆ ప్ర‌యాణికులు రైళ్ల‌పై చేస్తున్న దాడులు మ‌రింత దుమారం రేపుతూ ఉన్నాయి. ఎలాగోలా రైలేక్కితే చాల‌న‌ట్టుగా ఉత్త‌రాది కుంభమేళా యాత్రికులు ఆపి ఉన్న రైళ్ల‌పై వీలైన వాటితో విరుచుకుప‌డుతున్నారు. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి. వాటి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత‌మంచిది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. కుంభమేళాలో కోట్ల మంది భ‌క్తులు స్నాన‌మాచ‌రిస్తున్న నీళ్లు తాగ‌డం కాదు క‌దా, అవి స్నానం చేయ‌డానికి కూడా ప‌నికిరావ‌ని అంటున్నారు. మ‌రి ఏ విదేశీ సంస్థో, మీడియా సంస్థో ఇలా చెబితే వారి క‌థ అంతే. వారికి అంత సాహ‌సాలు కూడా ఉండ‌వు కానీ, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థే ఈ విష‌యాన్ని తేల్చి చెబుతూ ఉంది. ఈ మేర‌కు నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూన‌ల్ స్పందించింది.

కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ సంస్థ ఫిబ్ర‌వ‌రి మూడో తేదీన ఇచ్చిన నివేదిక‌ను ప్ర‌స్తావిస్తూ. .గంగ‌, యుమ‌న సంగమ ప్రాంతంలోని నీళ్లు తాగ‌డం కాదు క‌దా, స్నానం ఆచ‌రించ‌డానికి కూడా త‌గిన‌వి కావ‌ని చెప్పాయి కేంద్ర సంస్థ‌లు. అది కూడా అది ఫిబ్ర‌వ‌రి మూడో తేదీ నాటి ప‌రిస్థితి. మ‌రి ఆ త‌ర్వాత ఏకంగా కోట్ల మంది ఆ నీళ్ల‌లో స్నానాలు ఆచ‌రించారు. ఇక ఈ ఘాట్ల‌కు స‌మీపంలోనే అక్క‌డ‌కు వ‌చ్చిన కోట్ల మంది ప్ర‌కృతి కార్యాల‌న్నీ చేస్తూ ఉన్నారు! దీంతో కాలుష్య స్థాయి మ‌రెంత‌కు వెళ్లి ఉంటుందో ఊహ‌ల‌కు వ‌దిలేయ‌వ‌చ్చు.

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ప్ర‌కారం.. 2004లో కేంద్రం పెట్టిన ప్ర‌మాణాల ప్ర‌కారం నీటిలో ఫీక‌ల్ కొలిఫామ్ స్థాయి వంద మిల్లీ లీట‌ర్ల‌కు ఐదు వంద‌ల ఎంపీఎన్ గా ఉండాలి. గ‌రిష్టంగా వంద మిల్లీ లీట‌ర్ల నీటికి 2500 ఎంపీఎన్ స్థాయిలో

ఉంటే ఆ నీటిని క‌లుషిత నీటిగా పేర్కొంటున్నాయి కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌మాణాలు. అయితే.. ఫిబ్ర‌వ‌రి మూడో తేదీ నాటికే గంగ‌-య‌మున నీటిలో ఫీక‌ల్ కొలిఫామ్ స్థాయి 9000 ఎంపీఎన్ గా ఉంద‌ట వంద మిల్లీ లీట‌ర్ల‌కు. కొన్ని చోట్ల ఇది 11 వేల స్థాయిలో కూడా ఉంద‌ట‌. క‌నిష్టంగా ఐదు వేల స్థాయిలో ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లే చెబుతున్నాయి. మ‌రి ఆ త‌ర్వాత ఈ స్థాయి ఎంత‌కు పెరిగి ఉంటుందో చెప్పే వారు లేరు.

మ‌రి దీని వ‌ల్ల ఏమ‌వుతుంది అంటే.. అర్థ‌మ‌య్యేలా చెప్పాలంటే ఆ నీళ్ల‌లో బ్యాక్టీరియా, వైర‌స్ లే కాదు, ప్రొటోజొవా కూడా ఉంద‌ని ఆ సంస్థ‌లే చెప్పాయి. వాటిని తాగితే అనారోగ్యం త‌ప్ప‌ద‌ని, అవి స్నానానికి కూడా ప‌నికిరావు అని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే భ‌క్త‌గ‌ణం మాత్రం వీటిని లెక్క చేసే ప‌రిస్థితుల్లో లేరు.

11 Replies to “కుంభ‌మేళా.. ఆ నీళ్ల‌లో స్నానం చేయ‌డానికి ప‌నికిరావు!”

  1. ande ma Jagan ithe akkada tera chapalu, red carpet, oka UV filtration plant, spa sona pettichu koni snanam chese vadu .

    leka pothe oka container water tadepalli palace lo ki teppichu kuni shower chese vadu.

    aa vadina nellani kodali, perni inka pakodi batch mahamrutham ani tage vallu

  2. Sanathana dharmam ante follow dharma principles and clean your mind …but now a days sanathana dharmam means create dramas, visit more temples and multiple times by using shortcut methods and to spend for these short cuts be greedy and earn/grab as much as possible…..devudaaaa..namo venkatesaya…saranam saranam

  3. అది “పుణ్యస్నానం”. ఈ “పీకల్ కోలిపారం, మరొకటి, మరొకటి- ఏమీ చేయలేవు. ఆ “పుణ్యం” లో అన్నీ కొట్టుకు పోతాయి. ఒకవేళ జరుగరానిది జరిగితే డైరెక్టర్ గా పుణ్యాత్ముని దగ్గరికే వెళతారుగా!

    ఈ పుణ్యస్నానాలు, తీర్థయాత్రలు, ఆ ”మేళా ఈ మేళాలు” ఉన్నంత వరకు ఇండియాకు -sorry- భారత్ కు ఏమీ కాదులెండి!

  4. అది “పుణ్య స్నానం” . ఈ “పీకల్ కొలిపారం” మరొకటి, మరొకటి -ఏమీ చేయలేవండి! ఒకవేళ జరుగరానిది జరిగితే డైరెక్టుగా ఆ “పుణ్యాత్ముని” దగ్గరకే చేరిపోతారు గదా. “ఈ మేళా, ఆ మేళా” ఉన్నంత వరకు భారత్ కు ఏమీ కాదు.

  5. బజార్లో దొరికే/ అమ్మబడే పళ్ళు, కూరగాయలు, నూడుల్స్ వంటివి ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రమాణాలలో ఉంటున్నాయా?

Comments are closed.