ఇండియాలో ఖరీదైన కార్లను కొని సోషల్ మీడియాలో పెట్టుకోగల వారిలో క్రికెటర్లు, సినిమా వాళ్లు, రాజకీయ రంగం వారే ముందు వరసలో ఉంటారు.
ఫలానా స్టార్ హీరో కోట్ల విలువ జేసే ఫలానా రకం కారు కొన్నాడని, లేదా హీరోయిన్ కొనిందనో, క్రికెటర్ల వద్ద పెద్ద ఖరీదైన కార్ల ఫ్లీటే ఉందనే వార్తలు తరచూ వస్తూ ఉంటాయి. రాజకీయ నేతల కార్ల వివరాలు గోప్యంగానే ఉంటాయి. వాళ్లు ఫొటోలు దిగి పోస్టు అయితే చేసుకోరు! అసలు చాలా మంది రాజకీయ నేతలు తమ పేరిట ఒక్క కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ లో చెబుతూ ఉంటారు.
అలాగే పారిశ్రామికవేత్తలు, సీఈవోల వద్ద కూడా పెద్ద పెద్ద కార్లే ఉన్నా, వారు కూడా పెద్దగా వాటిని హైలెట్ చేసుకోరు. క్రికెట్, సినిమా రంగాల వాళ్ల కార్లే హైలెట్ అవుతూ ఉంటాయి. ఇతర రంగాల విషయానికి వస్తే.. దేశంలో ఇక వేరే రంగాల్లో పని చేస్తే కోట్ల రూపాయల కార్లు కొనడం తేలిక కాదు. హాకీ ప్లేయర్లో, అథ్లెట్లో ఇప్పటి వరకూ ఇలాంటి గ్లామరస్ వార్తల్లో నిలవడం కష్టం ఇండియాలో. కొంతలో కొంత బ్యాడ్మింటన్ ప్లేయర్ల పని బెటర్.
అయితే ఇండియాలో అథ్లెటిక్స్ లో కృషి చేసినా ఖరీదైన కార్లు కొనచ్చని నిరూపిస్తున్నాడు నీరజ్ చోప్రా. రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ తో పాటు, వరల్డ్ ఛాంపియన్స్ షిప్స్ కూడా సాధించిన నీరజ్ చోప్రా మరో ఖరీదైన కారును కొన్నాడు. ఔడీలోని ఎస్యూవీ రకం కారు ఆర్ఎస్ క్యూ 8ను కొనుగోలు చేసి దాంతో ఫొటోలు దిగి పోస్టు చేశాడు నీరజ్. దీని ఎక్స్ షోరూమ్ ధరే మూడు కోట్ల రూపాయలట!
ఇది మాత్రమేగాక ఈ అథ్లెట్ వద్ద మరిన్ని ఖరీదైన కార్లు ఇప్పటికే కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయట. ఫోర్డ్ మస్టంగ్ తో పాటు టయోటా ఫార్చూనర్లు కూడా నీరజ్ వద్ద ఉన్నాయట. తన ఇంట్లో వాళ్లు ఇళ్లు కొనుగోలు చేయమని తనకు చెప్పారని, ఇప్పటికే ఇళ్లు కొనేసి.. తనకు ఇష్టమైన కార్లను కొనుగోలు చేస్తున్నట్టుగా నీరజ్ చోప్రా చెప్పాడు.
క్రికెటేతర రంగాల్లో కృషి చేసి కూడా అడ్వర్టైజ్ మెంట్లలో కనిపిస్తూ ఇలా ఖరీదైన లైఫ్ స్టైల్ ను చవిచూడవచ్చని నీరజ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. క్రికెటేరత రంగాల్లో రాణించి పేరు, ప్రఖ్యాతులతో పాటు డబ్బులు సంపాదించుకున్న వారిలో సానియా, బ్యాడ్మింటన్ ప్లేయర్లు కొందరు, చెస్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు అథ్లెటిక్స్ నుంచి నీరజ్ వారి సరసన నిలుస్తున్నాడు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,