భూమి కబ్జా.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

10-11 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసు కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో, తెలుగు నిర్మాత చిక్కుల్లో పడ్డారు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. Advertisement హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న…

10-11 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసు కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో, తెలుగు నిర్మాత చిక్కుల్లో పడ్డారు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాజేసేందుకు టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ ప్రయత్నించారనేది ప్రధానమైన అభియోగం. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఈ ప్రభుత్వ భూమిని నొక్కేసేందుకు ఆయన నకినీ పట్టాలు సృష్టించారు.

పత్రాల ఆధారంగా 84 ఎకరాల భూమి తనదేనంటూ నిర్మాత వాదించారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగం గౌడ్ సహాయంతో భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీనిపై 2003లోనే ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ న్యాయపోరాటానికి దిగింది.

చివరికి ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2 దశాబ్దాలకు పైగా విచారణ సాగిన ఈ కేసులో శివరామకృష్ణ సమర్పించిన భూమి పత్రాలు నకిలీవని సుప్రీంకోర్టు తేల్చింది. ఆర్కియాలజీలోనే పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో, నిర్మాత ఇలా నకిలీ పత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై కేసు నమోదుచేసిన పోలీసులు, వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి తిరిగి ప్రభుత్వ పరమైంది. గతంలో ఈయన మహేష్, వెంకటేష్ తో సినిమాలు నిర్మించారు.

8 Replies to “భూమి కబ్జా.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్”

Comments are closed.