‘ఊ’ అంటావా మామ.. ‘కిస్సిక్’ అంటావా?

‘కిస్సిక్’ లిరిక్స్ తో సాగే ఈ పాట బాగాలేదని చెప్పలేం. ఉన్నంతలో ఓకే. కానీ అది సరిపోదు.

“ఊ అంటావా మామ.. ఉఊ అంటావా..”.. యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపిన సాంగ్ ఇది. ఈ పాటలో ఉన్న మత్తు, గమ్మత్తు అంతా ఇంతా కాదు. పుష్ప-1లో ఉన్న ఈ సాంగ్ ఇప్పటికీ హిట్టే, ఏదో ఒక వేదికపై వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పుష్ప-2 నుంచి ఐటెంసాంగ్ వచ్చింది.

‘కిస్సిక్’ లిరిక్స్ తో సాగే ఈ పాట బాగాలేదని చెప్పలేం. ఉన్నంతలో ఓకే. కానీ అది సరిపోదు. ఎందుకంటే, “ఊ అంటావా మామ..” పాటను మించి ఉండాలి. కుదరకపోతే కనీసం సమానంగా ఉండాలి. మరి కిస్సిక్ సాంగ్ కు ఆ స్థాయి ఉందా? ఈ పాటకు అంత స్థాయి లేదంటున్నారు జనం.

నిజానికి చాలా పాటలు ఇనిస్టెంట్ గా హిట్టవ్వవు. వినగా వినగా వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా దేవిశ్రీ పాటలు. సరిలేరు నీకెవ్వరులో సాంగ్స్ కూడా అలానే హిట్టయ్యాయి. అయితే తాజాగా రిలీజైన కిస్సిక్ సాంగ్ కు ఆ లక్షణాలు కూడా లేవంటున్నారు జనం.

వినగా వినగా వైరల్ అయ్యేంత కంటెంట్ ఇందులో కనిపించడం లేదనేది కంప్లయింట్. “ఊ అంటావా..” సాంగ్ లో ఆ పదం అందర్నీ పట్టుకుంది. దానిచుట్టూ తాత్వికంగా రాసిన లైన్స్, మ్యూజిక్ అలా అతుక్కుపోయాయి.

కిస్సిక్ సాంగ్ లో ఇలా దేన్ని హైలెట్ చేయాలో మ్యూజిక్ డైరక్టర్ కు అర్థమైనట్టు లేదు. సాంగ్ మొదలైన నిమిషం వరకు కిస్..కిస్ అంటూ హమ్మింగ్ వినిపిస్తుంది. ఇందులో కొత్తదనం లేదు. ఏదో పబ్ లో వినిపించిన మ్యూజిక్ టైపులోనే ఉంది. ఆ తర్వాత “దెబ్బలు పడతాయ్” అనే హుక్ లైన్ ఎత్తుకున్నారు. అదేదో ముందు నుంచే ఎత్తుకుంటే బాగుండేదనే ఫీలింగ్ వచ్చింది. ఈ సంగతి పక్కనపెడితే.. ఓవరాల్ గా చూసుకుంటే, పాట దేశవ్యాప్తంగా హిట్టవుతుందా అంటే డౌటే.

సాంగ్ లో డాన్స్ మూమెంట్ పై కూడా కంప్లయింట్ ఉంది. ‘ఊ అంటావా’ సాంగ్ లో బన్నీ ఒడిలో కూర్చొని వేసే ఫ్లోర్ మూమెంట్ ఇనిస్టెంట్ గా హిట్టయింది. ఇలా కొత్తగా కనిపించే స్టెప్ ను లిరికల్ వీడియోలో చూపించలేకపోయారు. కిస్..కిస్ అంటూ బన్నీ-శ్రీలీల వేసిన స్టెప్ లో కొత్తదనం కనిపించలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే హుక్ లైన్, హుక్ స్టెప్, సాహిత్యం పరంగా ‘ఊ’ అంటావా మామ’ పాట.. ‘కిస్సిక్’ సాంగ్ కంటే చాలా బెటర్ గా ఉంది. బహుశా, సినిమా రిలీజైన తర్వాత పుష్ప-2 మేనియాలో సాంగ్ కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

13 Replies to “‘ఊ’ అంటావా మామ.. ‘కిస్సిక్’ అంటావా?”

  1. ఇప్పటికే టికెట్ రేట్లు పెంచడం, 3D షాట్లు లేని బొమ్మకి బలవంతంగా 3D పెట్టి 250% రేట్ పెత్తడం లాంటివి చాలా నెగటివ్ గా వెళ్తున్నాయ్ జనాల్లోకి..

    ఫ్యాన్స్ డబ్బుతో ఆస్కార్ కొనుక్కోవాలనే ప్లాన్ చతికిల పడుతుంది

  2. //కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం.//

    //1. ఇకపై ఏ స్టార్ హీరో సినిమా కూడా వారానికి మించి ఆడదు. థియేటర్ లో చూడాలి అనిపించే కల్కి లాంటి సినిమాలు తప్ప.

    //2. ఒకవేళ ఆడింది అంటే.. జబ్బలు చరుచుకోవడం తప్ప… నిజం కాదు

    3. పుష్చ 1 రిలీజ్ అయ్యే నాటి పరిస్థితులు వేరు.. అప్పుడప్పుడే జనాలు కొవిడ్ నుండి తేరుకుంటున్నారు. సినిమాలకు మొహం వాచి ఉన్నారు. ఇంకా OTT కి పూర్తిగా అలవాటు పడలేదు. అలాంటి టైమ్ లో వచ్చిన పుష్ప కంటెంట్ కూడా ఉండడం వల్ల బాగా ఆడేసింది.

    //4. ఇప్పుడు జనాలకి అంతకి మించిన కంటెంట్ అరచేతిలో అందుబాటులో ఉంది. వాడి ఇష్టం వచ్చిన టైమ్ లో చూసుకోవడానికి. ఇప్పుడు ట్రాఫిక్ సాగరాన్ని ఈదుకుని మరీ థియేటర్ కి వెళ్లి.. డబ్బులు.. సమయం బొక్కెట్టుకుని చూసే ఓపిక… దూ…ల ఎవడికీ ఉండడం లేదు.. ఫ్యాన్స్ కి తప్ప.

    //5. నెలన్నర ఆగితే ఇంట్లో కూర్చుని… పేద్ద టీవీ లో… హోమిథియేటర్ సిస్టమ్ లో కుటుంబంతో కలిసి తక్కువ ఖర్చులో.. వారికి ఇష్టమైన టైమ్ లో… ఇంట్లోనే స్నాక్స్ కూల్డ్రింక్స్ రెడీ చేసుకుని… హ్యాపీ గా చూసేస్తున్నారు.

  3. Only two words in song – Dinchu, Debbalu. Dancer is a doctor, Director is ex-lecturer, Writer is Oscar winner. Shows where the society is now headed.

Comments are closed.