నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే కామన్ ప్రశ్న ఒకటి రెడీగా వుంటుంది. పెళ్లి ఎప్పుడు.. ఎవరా వరుడు అంటూ క్వశ్చను ఎదురువుతూ వుంటుంది. అలా అని రష్మిక ఏమీ తప్పించుకోదు. పాజ్ అంటూ దాటవేయదు. తెలివిగా ఏదో ఒక సమాధానం చెబుతూనే వుంటుంది. ఆ సమాధానంలో ఓ చిన్న క్లూ కూడా పడేస్తూనే వుంటుంది.
నిన్నటికి నిన్న జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో కూడా రష్మిక కు యాంకర్ నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది. దానికి రష్మిక చెప్పిన సమాధానం ఏమిటంటే…’అందరికీ తెలిసిందే కదా?’
దానికి అక్కడ వున్న వారి నుంచి నవ్వులే నవ్వులు. రష్మిక ఇలాంటి క్లూలు ఇవ్వడం కొత్త కాదు. తను ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫొటోలు ఇన్ స్టా లో పెడుతూ వుంటుంది. అదే టైమ్ లో అదే లొకేషన్ లో వున్నట్లు మరో హీరో నుంచి కూడా ఫొటోలు వస్తుంటాయి. ఈ రెండూ మ్యాచ్ అవుతాయి అని ఆ ఇద్దరికీ తెలియంది కాదు. కానీ అలా అని ఆపరు. ఈ సరదా పజిల్ లను వారు ఎంజాయ్ చేస్తుంటారు.
ఇలా ఎన్నో సార్లు జరిగింది. సేమ్ ప్లేస్, సేమ్ కంట్రీ, సేమ్ టు సేమ్ అనేట్లు రష్మిక పెట్టిన ఫొటోలు. ఇప్పుడు కూడా అందుకే రష్మిక ఏమీ దాచుకోలేదు. ఎవర్ని చేసుకుంటారు అంటే.. మీకు తెలుసుగా అంటూ నవ్వేసింది. అంతా బాగానే వుంది. ఇకపై ఎవర్ని పెళ్లి చేసుకుంటారు అని అడగకూడదు. పెళ్లి ఎప్పుడు అని అడగాలి. అదే కదా బ్యాలన్స్ క్వశ్చను.
vc available 9380537747
Call boy jobs available 7997531004
వార్తల్లో ఉండడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళూ గట్టిగానే చేస్తున్నారు. లేకపోతే ఎవడూ పట్టించుకోడు
రవిక లేని రాష్మిక