Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్సీబీ విచారణకు హాజరైన దీపిక, శ్రద్ధ, సారా

ఎన్సీబీ విచారణకు హాజరైన దీపిక, శ్రద్ధ, సారా

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఈరోజు కీలక దశకు చేరుకుంది. హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లను ప్రస్తుతం ఎన్సీబీ విచారిస్తోంది. ముందుగా దీపిక పదుకోన్ ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకోగా.. తర్వాత కొంతసేపటికి శ్రద్ధాకపూర్, ఆ తర్వాత సారా అలీఖాన్ ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యారు.

క్వాన్ సంస్థకు చెందిన జయ సాహా విచారణలో భాగంగా ఈ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. డ్రగ్స్ కు సంబంధించి వీళ్లు జయ సాహాతో వాట్సాప్ లో ఛాటింగ్ చేసినట్టు నిర్థారించిన ఎన్సీబీ.. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను ఇప్పటికే విచారించిన అధికారులు.. జయసాహా, కరిష్మా ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా దీపికను ప్రశ్నిస్తున్నారు.

జయ సాహాతో దీపిక జరిపినట్టు కొన్ని వాట్సాప్ సంభాషణలు బయటకొచ్చాయి. అందులో దీపిక "మాల్" ఉందా అని అడుగుతుంది. ఆ తర్వాత "వీడ్ వద్దు హ్యాష్ కావాలంటూ" మరో మెసేజ్ కూడా ఉంది. ఈ మెసేజీలతో పాటు కరణ్ జోహార్, సుశాంత్ సింగ్ పార్టీలకు సంబంధించి దీపికను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

మరోవైపు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ను కూడా ఎన్సీబీకి చెందిన మరో 2 టీమ్స్ ప్రశ్నిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ కోసం గంజాయి  ఆకుల నుంచి తయారుచేసిన సీబీడీ ఆయిల్ ను తెప్పించినట్టు జయ సాహా విచారణలో ఒప్పుకుందట. అటు సారా-సుశాంత్ కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ టైమ్ లో కూడా డ్రగ్స్ వాడినట్టు, సుశాంత్ తన గెస్ట్ హౌజ్ లో ఇచ్చిన పార్టీలో సారా పాల్గొనగా, అక్కడ కూడా డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?