పవన్ తో సినిమా.. ఆశలు వదిలేసిన నిర్మాత

దాదాపు ఫైనల్ స్టేజ్ లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు పూర్తిచేయడానికే చాలా టైమ్ తీసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా…

దాదాపు ఫైనల్ స్టేజ్ లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు పూర్తిచేయడానికే చాలా టైమ్ తీసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.

మరి ఇలాంటి టైమ్ లో పవన్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడా? ఫ్రెష్ గా కాల్షీట్లు ఇవ్వగలడా? ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. అందుకే సురేందర్ రెడ్డితో అతడు చేయాల్సిన సినిమాపై ఎవ్వరూ నమ్మకం పెట్టుకోవడం లేదు. చివరికి ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి కూడా.

“పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చి కూడా దాదాపు ఐదేళ్లు అవుతోంది. బయట నుంచి తెచ్చిన డబ్బు కాదు అది. నా సొంత డబ్బు. ఇప్పటివరకు ఆయనతో సినిమా చేయలేకపోయాను. నా బ్యాడ్ లక్. కరెక్ట్ గా ఆయన ఓకే చెప్పిన టైమ్ కు మా డైరక్టర్ వెళ్లి అఖిల్ తో సినిమా చేశాడు. అదే టైమ్ లో కరోనా వచ్చింది.”

సురేందర్ రెడ్డి చెప్పిన కథ పవన్ కు విపరీతంగా నచ్చిందంట. కథ విన్న తర్వాత కౌగిలించుకున్నాడట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ సినిమాపై తనకు ఆశల్లేవని అంటున్నాడు నిర్మాత.

“పవన్ తో సినిమా చేస్తే సురేందర్ రెడ్డి డైరక్షన్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, కథ అంత బాగుంది. నాకే కాదు, పవన్ కల్యాణ్ కు కూడా చాలా బాగా నచ్చింది. కథ విన్న వెంటనే లేచి సురేందర్ ను హగ్ చేసుకున్నారు. గతంలో కిక్ సినిమా చేయలేకపోయాను, ఇది మళ్లీ అంత కిక్ ఇచ్చిందన్నారు. ఏం మార్చొద్దు, ఇలానే చేద్దాం అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ తో సినిమా చాలా కష్టం.”

భవిష్యత్తులో పవన్ తో సినిమా చేస్తాననే నమ్మకం తనకు లేదని చెప్పేశాడు రామ్. అందుకే ఆ కథను అలానే వదిలేసి, వేరే కథతో వేరే హీరోలను సంప్రదిస్తున్నామన్నాడు. అదే టైమ్ లో సురేందర్ రెడ్డి నుంచి అడ్వాన్స్ వెనక్కు తీసుకునే ఆలోచన లేదని.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సురేందర్ ఉన్నాడని అంటున్నాడు.

4 Replies to “పవన్ తో సినిమా.. ఆశలు వదిలేసిన నిర్మాత”

Comments are closed.