ఉత్తరాంధ్రలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ కూటమిలో కుంపట్లు రాజుకున్నాయి. జనసేన టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ పోరు సాగుతోంది. ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితి ఉంది. ఇది అంతకంతకు పెరిగి రెండుగా అక్కడ కూటమి చీలిపోయింది.
నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యేగా లోకం మాధవి ఉన్నారు. టీడీపీ ఇంచార్జ్ గా కర్రోతు బంగార్రాజు ఉన్నారు. ఈ ఇద్దరి ఆధిపత్య పోరుతో కూటమిలో కో ఆర్డినేషన్ లేకుండా పోయింది. టీడీపీని తొక్కిపెట్టి వైసీపీ నేతలకు ఉపాధి హామీ పనులు జనసేన ఎమ్మెల్యే అప్పగించారని తమ్ముళ్ల అభియోగం.
టీడీపీ నేతలే ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నారని జనసేన ఆరోపణ. ఇలా నెల్లిమర్లలో కూటమి రాజకీయం వేడెక్కడంతో జనసేన ఎమ్మెల్యేను, టీడీపీ ఇంచార్జిని రెండు పార్టీల ముఖ్య నేతలు అమరావతికి పిలిపించారు. ఇద్దరితో విడిగా కలివిడిగా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ఐక్యంగా ఉందని అదే తీరున నియోజకవర్గంలోనూ పనిచేయాలని సూచించారు. అంతా కలసి కో ఆర్డినేషన్ చేసుకోవాలని కోరారు. కూటమి ఐక్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
కూటమి ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని కూడా సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు మరో విడత చర్చలు కూడా ఉంటాయని అంటున్నారు. ఏపీలో అనేక నియోజకవర్గాలలో ఇదే తరహాలో కూటమి నేతల మధ్య చిచ్చు రాజుకుంటోంది. నెల్లిమర్లతో మొదలెట్టారు, ఇక చాలా పంచాయతీలు రెండు పార్టీల పెద్దలూ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పై స్థాయిలో ఐక్యత ఉందని చెప్పినా లోకల్ గా లీడర్లు కలసి పనిచేసుకుంటారా అన్నదే ఆలోచించాలని అంటున్నారు. ఎమ్మెల్యే సీటు మీదనే రెందు వైపులా కన్ను ఉన్నపుడు ఆ సామరస్యం ఎలా కుదురుతుంది అన్నది కూడా తర్కానికి అందని ప్రశ్నగా ఉంది.
vc estanu 9380537747
11/11 న అసెంబ్లీ సమావేశాలు అంటే దేవుడి స్క్రిప్టే అంటావా వెంకీ ?
11రోజులు కూడా
Call boy works 9989793850
ట్వీట్స్ డిలీట్ చేస్తున్నారు…
అకౌంట్ లు డియాక్టివేట్ చేస్తున్నారు…
సారీ లు చెప్తూ వీడియోస్ వదులుతున్నారు..
భయం … అది పుట్టించింది ఎవరు?